సుదీప్, హరికృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Published On: September 2, 2017   |   Posted By:
సుదీప్, హరికృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. ఈరోజు (02-09-17) మరో ఇద్దరు ప్రముఖులు కూడా పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. కన్నడ సినీపరిశ్రమలో స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న సుదీప్ ఈరోజు తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్ర్టేట్ చేసుకుంటున్నాడు. ఇక నటుడు నందమూరి హరికృష్ణ జన్మదినం కూడా ఈరోజే కావడం విశేషం.
కన్నడనాట సుదీప్ చాలా పెద్ద హీరో. డబ్బింగ్ సినిమాలతో తెలుగువాళ్లకు కూడా పరిచయమైన సుదీప్.. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో తెలుగులో స్ట్రయిట్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఈగ సినిమాలో సుదీప్ నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కన్నడనాట షిమోగా జిల్లాలో పుట్టిన సుదీప్, ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలే శ్వాసగా బతికాడు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్నాచితకా సినిమాలు చేసి అంచెలంచెలుగా ఎదిగాడు. 1997లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరో, 2003లో వచ్చిన కిచ్చా సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. అప్పట్నుంచి మినిమం గ్యాప్ లో హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి 3 సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.
మరో నటుడు హరికృష్ణ కూడా ఈరోజు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా హరికృష్ణ అందరికీ సుపరిచితుడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన హరికృష్ణ.. సినిమాల్లో రాణించాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రి బాటలో రాజకీయాల్లో కొనసాగాలనుకున్నారు. కానీ అనూహ్యంగా సినిమాల్లో కూడా క్లిక్ అయ్యారు. శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరిలాహిరి లాహిరిలో, సీతయ్య.. ఇలా తనకంటూ కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఉంచుకున్నారు హరికృష్ణ.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుదీప్, హరికృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.