సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రకటన

Published On: July 12, 2021   |   Posted By:

సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రకటన

సుధీర్‌బాబు, హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్ పి ప్రొడ‌క్ష‌న్ నెం.5.

హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్)లో ప్రొడక్షన్ నెంబర్ 5 చిత్రానికి సైన్ చేశారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్‌ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ప్రముఖ నటుడు, రచయిత హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. సోనాలి నారంగ్, శ్రిష్టి స‌మ‌ర్ప‌ణ‌లో ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యాన‌ర్‌లో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ల‌వ్‌స్టోరీ చిత్రం విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. దీంతో పాటు ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. మీడియం మ‌రియు హై బ‌డ్జెట్ ల‌తో వ‌రుస‌గా విభిన్న త‌ర‌హా చిత్రాల‌ను ప్రక‌టిస్తూ త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి సంస్థ‌.

సుధీర్ బాబు, హ‌ర్ష వ‌ర్ధ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ ఆగ‌స్ట్ నుండి ప్రారంభంకానుంది. ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

తారాగ‌ణం:  సుధీర్ బాబు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం – హ‌ర్ష వ‌ర్ధ‌న్‌
నిర్మాత‌లు – నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహ‌న్ రావు
బ్యానర్స్ – శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్)
స‌మ‌ర్ఫ‌ణ – సోనాలి నారంగ్‌, శ్రిష్టి