సుధీర్ పాంచ్ ప‌టాకా

Published On: November 4, 2017   |   Posted By:

సుధీర్ పాంచ్ ప‌టాకా

ఈ ఏడాది శ‌మంత‌క మ‌ణి చిత్రం త‌ర్వాత హీరో సుధీర్ బాబు మ‌రో సినిమాను స్టార్ట్ చేయ‌నేలేదు. సినిమాలు పైప్‌లైన్‌లో తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు మాత్రం బాగానే చేశాడ‌నిపిస్తుంది. ఎందుకంటే హీరో సుధీర్ ఏకంగా ఐదు సినిమాలు అనౌన్స్ చేయ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ ఐదింటిలో ఓ సోషియో ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ ద్వారా ఇంద్ర‌సేనతో పాటు, ఫాద‌ర్ సెంటిమెంట్ మిక్స్ అయిన ప్రేమ‌క‌థ‌తో రాజ‌శేఖ‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం కానున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో పుల్లెల గోపీచంద్ మూవీ రూపొంద‌నుండ‌గా, డిసెంబ‌ర్‌లో ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా స్టార్ట్ అవుతుంది. రైట‌ర్ నుండి డైరెక్ట‌ర్‌గా మారిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ థ్రిల్ల‌ర్ సినిమా చేయ‌బోతున్నాడు. ఇది అమెరికా నేప‌థ్యంలో రూపొందనుంది.