సురేంద‌ర్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డుతుందా?

Published On: August 11, 2017   |   Posted By:

సురేంద‌ర్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డుతుందా?

రాశి కంటే వాసికే ప్రాధాన్యం ఇచ్చే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. 12 ఏళ్ల కెరీర్‌లో 8 చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కెరీర్ ప్రారంభంలో సంవ‌త్స‌రానికో సినిమా అన్న‌ట్లుగా ఉన్న సూరి.. త‌రువాత రెండేళ్ల‌కో సినిమా అన్న‌ట్లుగా శైలిని మార్చుకున్నాడు. అయితే రేసు గుర్రం త‌రువాత వ‌రుస‌గా కిక్ 2, ధ్రువ చిత్రాలు చేసి.. మ‌ళ్లీ సంవ‌త్స‌రానికో సినిమా అంటూ పాత రూటునే ఎంచుకున్నాడు.

అయితే గ‌తేడాది చివ‌ర‌లో వ‌చ్చిన ధ్రువ త‌రువాత చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డితో బిజీగా మారిన సురేంద‌ర్ రెడ్డి.. వ‌చ్చే ఏడాది వేస‌విలోనే ఆ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. అంటే.. ఏడాదికో సినిమా అన్న‌ట్లుగా ఉన్న సురేంద‌ర్ శైలి మ‌ళ్లీ రెండేళ్ల‌కో సినిమా అన్న‌ట్లుగా మారుతోంద‌న్న‌మాట‌.