సూపర్ హిట్ సినిమాను గుర్తుచేసిన ‘నా నువ్వే’ వీడియో సాంగ్

Published On: April 20, 2018   |   Posted By:

సూపర్ హిట్ సినిమాను గుర్తుచేసిన ‘నా నువ్వే’ వీడియో సాంగ్

ఫస్ట్ టైం కల్యాణ్ రామ్ రొమాంటిక్ గా మారాడు. ప్యూర్ లవ్ సబ్జెక్ట్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా పేరు నా నువ్వే. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు. వీడియో  అద్భుతంగా ఉంది. కల్యాణ్ రామ్-తమన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. సేమ్ టైం, ఇదే వీడియో గతంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా పాటను విజువల్ సాక్షిగా గుర్తుచేస్తుంది.

లవ్ సినిమాల మేకింగ్ లో కింగ్ మణిరత్నం, కొంతకాలం కిందట ఓకే బంగారం అనే సినిమా తీశాడు. అది ఇనిస్టెంట్ గా హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే మణిరత్నంకు రీఎంట్రీ లాంటి సినిమా అది. ఆ మూవీలో ఓ పాట ఉంది. దుల్కర్, నిత్య మధ్య వచ్చే ఆ పాట సూపర్ హిట్ అయింది. తాజాగా విడుదలైన నా నువ్వే సాంగ్ చూస్తుంటే.. ఓకే బంగారంలోని ఆ పాట గుర్తుకురావడం సహజం.

ఇలా ఈ రెండు పాటలు గుర్తుకురావడానికి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యాంబియన్స్. నా నువ్వేలో పాటలో, ఓకే బంగారం పాటలో ఒకే రకమైన యాంబియన్స్ కనిపిస్తాయి. లైటింగ్ నుంచి వాడిన బెడ్ వరకు అన్నీ ఒకేలా అనిపిస్తాయి. ఇలా ఈ రెండు పాటలూ ఒకేలా అనిపించడానికి కారణం సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. అవును.. ఈ రెండు సినిమాలకు ఇతడే సినిమాటోగ్రాఫర్.

మొత్తమ్మీద నా నువ్వే నుంచి విడుదల చేసిన చిన్న వీడియో సాంగ్ మరోసారి మణిరత్నం సినిమాను, అప్పటి రొమాంటిక్ ఫీల్ ను గుర్తుచేసింది. ఆ సినిమా రేంజ్ లో కల్యాణ్ రామ్ తాజా చిత్రం నా నువ్వే కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.