సూప‌ర్ ప‌వర్‌ చిత్రం ప్రారంభోత్స‌వం

Published On: December 5, 2018   |   Posted By:

సూప‌ర్ ప‌వర్‌ చిత్రం ప్రారంభోత్స‌వం

శివ ఫిలిం ఫ్యాక్ట‌రీ బేన‌ర్ పై శివ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `సూప‌ర్ ప‌వ‌ర్`. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖులు సారిప‌ల్లి కొండ‌ల‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ కెమేరా స్విచాన్ చేశారు. వి.సాగ‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ…“గ‌తంలో నేను `పోలీస్ ప‌వ‌ర్` చిత్రంలో హీరోగా న‌టించాను. ఆ సినిమా మాస్ హీరోగా నిల‌బ‌డ‌టానికి తోడ్ప‌డింది. అదే స్ఫూర్తితో నా బేన‌ర్ లో `మాస్ ప‌వ‌ర్‌` చిత్రాన్ని నిర్మించాను. ఇందులో ఐదు ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాను జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక `సూప‌ర్ ప‌వ‌ర్‌` చిత్రం ఈ రోజు షూటింగ్ ప్రారంభించాం. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షెడ్యూల్ ప్రారంభిస్తాం. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో `సూప‌ర్ ప‌వ‌ర్` చిత్రం ఉంటుంది. ఎన్నో అడ్డంకులు అధిగ‌మించి చివ‌ర‌కు `సూప‌ర్ ప‌వ‌ర్` క‌ప్పు హీరో ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌ది చిత్ర క‌థాంశం. ఇందులో ప‌ది ఫైట్స్ ఉంటాయి. ప‌ది మంది ఫైట్ మాస్ట‌ర్స్ ఒక్కో ఫైట్ ను కంపోజ్ చేయ‌నున్నారు. నా గ‌త చిత్రాల‌ను ఆద‌రించిన‌ట్టు ఈ సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
సారి ప‌ల్లి కొండ‌ల‌రావు మాట్లాడుతూ…“శివ నాకు తొలి సినిమా నుంచి తెలుసు. సినిమా సినిమాకు ఎంతో ఇంప్రూవ్ అవుతూ ఫైట్స్, డాన్స్ అద్భుతంగా చేస్తున్నాడు. ఇంకా శివ ఎంతో మందికి ప‌ని క‌ల్పిస్తూ వృద్ధిలోకి రావాల‌న్నారు.
వి.సాగ‌ర్ మాట్లాడుతూ…“శివ మంచి టెక్నిషీయ‌న్‌. `పోలీస్ ప‌వ‌ర్`,. మాస్ ప‌వ‌ర్ ` లా సూప‌ర్ ప‌వ‌ర్ చిత్రం కూడా ఆడాలన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో జొన్న‌ల‌గ‌డ్డ శివ పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించారు. అలాగే `మాస్ ప‌వ‌ర్` చిత్రం లోని ఫైట్స్ , ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శించారు.