సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్

Published On: August 21, 2017   |   Posted By:

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్

శ్రీకరణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత గొంటి శ్రీకాంత్ నిర్మించిన చిత్రం బెస్ట్ లవర్స్. శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రీకరణ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ..’ ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రం బెస్ట్ లవర్స్. దర్శకుడు నంది వెంకట్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి ప్రేమికుడు, ప్రేమికురాలు చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ కుదిరింది. సాయికిరణ్ అందించిన ఇటీవలే విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము’..అన్నారు.

శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి. సాయి కిరణ్, కెమెరా: డి. యాదగిరి, నిర్మాత: శ్రీకాంత్ గొంటి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నంది వెంకట్ రెడ్డి.

Source:-Press – Note