సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న “కెఎస్100” చిత్రం..!!

Published On: June 3, 2019   |   Posted By:
మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100″..  షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన  ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ”  “కెఎస్100” చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుంది.. ఈ నెల 21 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. నేడు సెన్సార్ పూర్తి చేసుకుని ఒక్క కట్ లేకుండా  “ఏ” సర్టిఫికెట్ ని పొందింది.. సినిమా లో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.. సినిమా చాల బాగా వచ్చింది.. సినిమాలోని అంశాలను ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు.. 
 
చిత్ర చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ” కెఎస్100″ చిత్రం అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది..  సెన్సార్ కూడా పూర్తి చేస్కుని ఒక్క కట్ లేకుండా “ఏ” సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉంది.. ఈ నెల 21న సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు” అన్నారు..  
అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు.. 
 
నటీనటులు :  అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు
 
సాంకేతిక నిపుణులు
మాటలు- కధ- కథనం-దర్శకత్వం: షేర్
నిర్మాత : వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ, 
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్