సైరాలో త‌మ‌న్నా

Published On: April 10, 2018   |   Posted By:
సైరాలో త‌మ‌న్నా
బాహుబ‌లి లో అవంతికగా న‌టించిన త‌ర్వాత త‌మ‌న్నా.. సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయాయో.. లేక సెల‌క్టివ్‌గా ముందు కెళుతుందో తెలియ‌డం లేదు. అయితే ప‌రిమిత‌మైన ఆఫ‌ర్స్‌తో త‌మ‌న్నా సినిమాలు చేస్తుంది. ఈమె ఇప్పుడు మెగా ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహా రెడ్డి`లో న‌టించ‌బోతుంద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా..సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్స్ న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ స్టార్స్‌కు మ‌రో స్టార్‌గా త‌మ‌న్నా యాడ్ కానుంద‌ని వార్తలు విన‌ప‌డుతున్నాయి.`సైరా న‌ర‌సింహారెడ్డి`లో ఓ కీల‌క పాత్రలో త‌మ‌న్నాన‌టిస్తుంద‌ట‌. మ‌రి దీనిపై త‌మ‌న్నా ఏమ‌ని స్పందిస్తుందో చూద్దాం.