సైరా ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

Published On: December 26, 2017   |   Posted By:
సైరా ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్
చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో రత్నవేలు సినిమాటోగ్రఫీతో ఈ సన్నివేశాల్ని తెరకెక్కించారు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు, కర్రసాము లాంటి యుద్ధ విన్యాసాలు ఇందులో ఉన్నాయి. ఈ సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయని యూనిట్ ప్రకటించింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది సైరా. నయనతార ఇందులో హీరోయిన్.