సైలెంట్ గా ప్రారంభమైన సైరా నరసింహారెడ్డి షూటింగ్

Published On: March 14, 2018   |   Posted By:

సైలెంట్ గా ప్రారంభమైన సైరా నరసింహారెడ్డి షూటింగ్

ఫస్ట్ షెడ్యూల్ తర్వాత మళ్లీ మరో ప్రకటన చేయలేదు. అంతా సెకెండ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఎలాంటి హంగు-ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ప్రారంభమైంది సైరా షూటింగ్. మొదటి షెడ్యూల్ జరిగిన అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఈ షూటింగ్ జరుగుతోంది. నిన్న మొదలైన ఈ షెడ్యూల్ మరో 2 రోజులు కొనసాగుతుంది.

అయితే ఇది ఫస్ట్ షెడ్యూల్ కు కొనసాగింపా లేక సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించారా అనే విషయంపై మాత్రం యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు షూటింగ్ జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్పడం లేదు. అభిమానుల నుంచి తీవ్రమైన వత్తిడి వస్తోందని, షూటింగ్ ఎక్కడుంటే అక్కడకు వందలాంది మంది వచ్చేస్తున్నారని అదే సమయంలో సినిమాకు సంబందించిన స్టిల్స్, షూటింగ్ లొకేషన్ పిక్స్ కూడా లీక్ అవుతున్నాయనే ఉద్దేశంతో ఎవ్వరికీ చెప్పడం లేదు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న సైరాలో నయనతార హీరోయిన్ గా నటించనుంది. బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.