సైలెంట్ గా స్టిల్ రిలీజ్ చేసిన పవన్ కల్యాణ్

Published On: September 4, 2017   |   Posted By:

సైలెంట్ గా స్టిల్ రిలీజ్ చేసిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి మూవీ స్టిల్ ఒకటి రిలీజ్ అవుతుందని చాలామంది ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ పవన్ పుట్టినరోజుకు ఒకరోజు ముందు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సో.. అది కేవలం కాన్సెప్ట్ పోస్టర్ మాత్రమే. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజికల్ ట్రీట్ అంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కు సంబంధించి లాస్ట్ లో ఒక్క క్లిప్ మాత్రమే ఉంది. అది కూడా లాంగ్ షాట్ లో పవన్ నిల్చున్న వీడియో. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారనే చెప్పాలి.

ఇలాంటి టైమ్ లో అభిమానుల్లో ఆనందం నింపింది హీరోయిన్ కీర్తి సురేష్. పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. పవన్ తో ఉన్న ఓ క్యూట్ స్టిల్ ను విడుదల చేసింది. కాన్సెప్ట్ పోస్టర్, మ్యూజికల్ ట్రీట్ కంటే ఈ ఫొటోనే ఎక్కువమందిని ఎట్రాక్ట్ చేసింది. కీర్తి సురేష్ ను చూస్తూ ముసిముసిగా పవన్ నవ్వుతూ ఉండే ఈ స్టిల్ సూపర్ గా క్లిక్ అయింది.

పవన్ కల్యాణ్ కు ఇది కెరీర్ లో 25వ చిత్రం కావడం విశేషం. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ నిర్మాత. కీర్తి సురేష్ తో పాటు అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయబోతున్నారు.