స్కెచ్ మూవీ రివ్యూ

Published On: February 23, 2018   |   Posted By:
స్కెచ్ మూవీ రివ్యూ
నటీనటులు – విక్రమ్, తమన్న, రవికిషన్, ఆర్కే సురేష్, రాధారవి, శ్రీమాన్, సూరి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – విజయ్ చందర్
బ్యానర్ – మువింగ్ ఫ్రేమ్స్
సంగీతం – తమన్
సినిమాటోగ్రాఫర్ – ఎమ్.సుకుమార్
ఎడిటింగ్ – రూబెన్
సెన్సార్ – యు/ఎ
వరుస ఫ్లాపులతో ఉన్నాడు విక్రమ్. మరీ ముఖ్యంగా శంకర్ తో చేసిన ఐ సినిమా ప్రభావం అతడిపై బాగా పడింది. అప్పట్నుంచి క్యారెక్టర్, గెటప్ పరంగా ఎలాంటి ప్రయోగాలు లేకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అతడు చేసిన స్కెచ్ మూవీ కూడా అలాంటిదే. పక్కా మాస్ మసాలా కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విక్రమ్ కు పెర్ ఫెక్ట్ స్కెచ్ అనిపించుకుందా.. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
సినిమాలో ఓ మంచి మనసున్న రౌడీ విక్రమ్. అంతా ఇతడ్ని స్కెచ్ అని పిలుస్తుంటారు. తండ్రి మాత్రం జీవా అని పిలుస్తుంటాడు. బైకులు, కార్లు కొనుక్కోవడానికి అప్పులిచ్చే ఓ వ్యక్తి దగ్గర విక్రమ్, అతడి ముగ్గురు స్నేహితులు పనిచేస్తుంటారు. ఎవరైతే సకాలంలో వడ్డీ కట్టరో.. వాళ్ల వాహనాల్ని సీజ్ చేసి తెచ్చే పనిలో ఉంటారు వీళ్లంతా. ఈ క్రమంలో విక్రమ్ ను అసహ్యహించుకుంటుంది తమన్న. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి, విక్రమ్ రౌడీ వేషాలు చూసి అసహ్యహించుకుంటుంది. కానీ తర్వాత అతడి మంచి మనసు అర్థం చేసుకొని ప్రేమలో పడుతుంది.
ఓవైపు విక్రమ్, తమన్న ప్రేమించుకుంటుంటారు. మరోవైపు కథలో ఊహించని ట్విస్టులు జరుగుతుంటాయి. విక్రమ్ గ్యాంగ్ లోని ముగ్గురు మిత్రులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వాళ్లు ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారనే విషయం విక్రమ్ కు అర్థంకాదు.
కట్ చేస్తే.. లోన్ రికవరీలో భాగంగా ఓ మాఫియా డాన్ కు చెందిన పాత ఫియట్ కారును తీసుకొచ్చేస్తాడు విక్రమ్. నిజానికి అది డాన్ ది కాదు. విక్రమ్ ఎవరివద్ద అయితే పనిచేస్తున్నాడో.. అతడి తండ్రికి చెందిన కారు అది. ఆ క్రమంలో విలన్లతో గొడవపడతాడు. ఆ తర్వాతే ఈ హత్యలన్నీ జరుగుతున్నట్టు కనిబెడతాడు విక్రమ్. అయితే కథలో ట్విస్టులు ఇక్కడితో ఆగిపోలేదు. విలన్, విక్రమ్ ను చంపాలని చూడ్డానికి మరో రీజన్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ ను క్లయిమాక్స్ లో రివీల్ చేస్తారు. ఫైనల్ గా తన పేరుకు తగ్గట్టు అద్భుతమైన స్కెచ్ వేసి విక్రమ్ ఈ ప్రమాదం నుంచి బయటపడతాడు. ఇది సింపుల్ గా స్కెచ్ స్టోరీ.
ప్లస్ పాయింట్స్
– విక్రమ్ పెర్ఫార్మెన్స్
– తమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌడ్ స్కోర్
– 2 యాక్షన్ సన్నివేశాలు
– ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
– విక్రమ్-తమన్న కెమిస్ట్రీ
– తమన్న లుక్స్
– రొటీన్ కథ
– బోర్ కొట్టించే ఫస్టాఫ్
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
మీరు విక్రమ్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా.. ? అయితే స్కెచ్ మూవీని లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే విక్రమ్ గతంలో నటించిన ఎన్నో సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా విక్రమ్ నటించిన 10 అనే సినిమా తీసుకుంటే.. అందులో కొన్ని సీన్లు ఇందులో కనిపిస్తాయి. అంతకంటే ముందు విక్రమ్ నటించిన వీడింతే సినిమా, జెమినీ సినిమాల్లోంచి చాలా సీన్లు, సందర్భాలు ఇందులో కనిపిస్తాయి. అలా అడుగడుగునా ఇంతకుముందు చూసేశాం కదా అనే ఫీలింగ్ తో చివరికంటూ సాగుతుంది స్కెచ్ మూవీ.
నటీనటుల విషయానికొస్తే విక్రమ్ నటన గురించే చెప్పుకోవాలి. చేసింది రొటీన్ స్టోరీనే అయినప్పటికీ విక్రమ్ యాక్టింగ్ మనల్ని కట్టిపడేస్తుంది. తమన్న ఉన్నంతలో డీసెంట్ గా కనిపించింది కానీ ఆమె చేసింది డీ-గ్లామరైజ్డ్ రోల్. ఇక హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అయితే వరస్ట్ అని చెప్పడంలో  ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకో విక్రమ్-తమన్న అస్సలు సూట్ కాలేదు. విక్రమ్ బ్యాచ్ లో ఉన్న వాళ్లు తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నికల్ గా కూడా తమన్ మినహా సినిమాలో ఏం లేదు. పాత కాలం నాటి కథకు తగ్గట్టే విజువల్స్ కూడా పాతగా ఉన్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం మాత్రం రీఫ్రెషింగ్ అనిపిస్తుంది. 2 పాటలు బాగా ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు ఎడిటర్ అవసరం లేదు. నాలుగు సీన్లు కలిపి చివరి వరకు సాగదీసినట్టు అనిపించింది. ఎంత దారుణం అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అసలు స్టోరీనే లేదు. అలా సాగింది ఎడిటింగ్.
ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, సినిమా మొత్తంలో మరో 2 యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ మ్యూజిక్, విక్రమ్ నటన మినహా స్కెచ్ లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మైనస్ ల గురించి చెప్పుకోవాలంటే మాత్రం చాలా ఉన్నాయి. ఇదొక రొటీన్ కథ. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అస్సలు పండగలేదు. ఎడిటింగ్ దారుణంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేవు.
బాటమ్ లైన్ –  విక్రమ్ అభిమానులు మాత్రమే ఈ స్కెచ్ ను తట్టుకోగలరు
రేటింగ్ – 2.5/5