స్టార్ హీరో స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి

Published On: December 20, 2017   |   Posted By:

స్టార్ హీరో స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి

తెలుగులో భానుమ‌తిగా `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు తెలుగులో డిసెంబ‌ర్ 21న `ఎంసీఏ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, త‌మిళంలో `క‌ణం` సినిమాలో కూడా న‌టిస్తుంది. ఇది కాకుండా త‌మిళ స్టార్ హీరోల్లో ఒక‌రైన సూర్యతో సాయిప‌ల్ల‌వి జ‌త క‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంద‌నేది స‌మాచారం. సూర్య‌తో సినిమా అంటే దాదాపు మ‌రో బై లింగ్వువ‌ల్ సినిమా క్రింద‌కే వ‌స్తుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న హీరోల‌కే ప‌రిమిత‌మైన సాయిప‌ల్ల‌వి, ఇక‌పై స్టార్ హీరోల‌తో జ‌త క‌ట్టేలా క‌న‌ప‌డుతుంది.