స్పానిష్ చిత్రం తెలుగు రీమేక్‌

Published On: May 17, 2018   |   Posted By:

స్పానిష్ చిత్రం తెలుగు రీమేక్‌

యు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా … స్పానిష్‌లో సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ `జూలియాస్ ఐస్‌`ను, త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. త‌న క‌వ‌ల సోద‌రిని చంపిన దుండ‌గుల‌ను క‌నుగొనే ఓ అమ్మాయి క‌థే ఈ సినిమా. మిస్ట‌రీని చేదిస్తున్న క్ర‌మంలో ఆమె త‌న కంటి చూపును క్ర‌మంగా కోల్పోతూ ఉంటుంది. యూర‌ప్‌లో విడుద‌లైన ఈ చిత్రం హ్యూజ్ హిట్ అయ్యి 20 మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది. ఈ సినిమాను కన్న‌డం, మ‌రాఠీ, మల‌యాళ భాషల్లో కూడా రీమేక్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్‌లాల్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ అమెరిక‌ల్ ఫిలిమ్ మేక‌ర్ ప‌ర‌మ్ గిల్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌డానికి అనుష్క శెట్టిని సంప్ర‌దించే యోచ‌న‌లో ఉన్నార‌ట క‌బీర్ లాల్‌