స్పైడర్ 2 వారాల వసూళ్లు

Published On: October 11, 2017   |   Posted By:
స్పైడర్ 2 వారాల వసూళ్లు
స్పైడర్ సినిమా థియేటర్లలోకి వచ్చి నిన్నటికి (10-10-17) సరిగ్గా 2 వారాలు అయింది. ఈ రెండు వారాల్లో గణనీయమైన వసూళ్లు సాధించింది స్పైడర్ సినిమా. మొదటి వారంతో పోల్చి చూస్తే రెండో వారంలో వసూళ్లు తగ్గినప్పటికీ.. ఓవరాల్ గా కలెక్షన్లలో ది బెస్ట్ అనిపించుకుంది స్పైడర్ మూవీ. ప్రపంచవ్యాప్త వసూళ్లలో ఇప్పటికే 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు వాారాల్లో 33 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ సాధించింది. నిజానికి ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఇది తక్కువే. కాకపోతే రాబోయే రోజుల్లో బడా సినిమాలేవీ  బరిలో లేకపోవడం స్పైడర్ కు కలిసొచ్చే అంశం.
ఏపీ, నైజాం 2 వారాల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 9.90 కోట్లు
సీడెడ్ – రూ. 4.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.95 కోట్లు
ఈస్ట్ – రూ. 3.82 కోట్లు
వెస్ట్ – రూ. 2.90 కోట్లు
గుంటూరు – రూ. 3.65 కోట్లు
కృష్ణా – రూ. 2.45 కోట్లు
నెల్లూరు – రూ. 1.85 కోట్లు
టోటల్ షేర్ – రూ. 33.32 కోట్లు