స్పైడ‌ర్‌ మూవీ రివ్యూ

Published On: September 27, 2017   |   Posted By:

స్పైడ‌ర్‌ మూవీ రివ్యూ

సంస్థ‌లు: ఎన్వీ ఆర్ సినిమా, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఆర్టిస్ట్ లు: మ‌హేష్ బాబు, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, భ‌ర‌త్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, ఆర్‌.జె.బాలాజీ, జె.పి., నాగినీడు త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌
సంగీతం: హారిస్ జైరాజ్‌
పాట‌లు: రామ‌జోగయ్య‌శాస్త్రి
కెమెరా: స‌ంతోష్ శివ‌న్‌
ఎడిటింగ్‌: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
స్టంట్ మాస్ట‌ర్‌: పీట‌ర్ హెయిన్స్
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: ఎన్వీ ప్ర‌సాద్‌
మ‌హేష్ సినిమా అన‌గానే స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం అన‌గానే ఏదో సామాజిక అంశం ఉండ‌నే ఉంటుంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త‌మిళ స్టార్ డైర‌క్ట‌ర్ మురుగ‌దాస్ క‌లిసి చేసిన సినిమా `స్పైడ‌ర్‌` విడుద‌ల‌వుతోంద‌నే వార్త సినిమా ప్రియుల్లో అమితాస‌క్తిని రేకెత్తిస్తోంది. గూఢ‌చారిగా మ‌హేశ్ ఎలా న‌టించారు? ఇంటెన్సివ్ లుక్స్ తో విడుద‌లైన ఫ‌స్ట్ పోస్ట‌ర్‌లాగా ఈ సినిమాలో మ‌హేష్ సూప‌ర్‌మ్యాన్‌లాగా క‌నిపిస్తారా? రోల‌ర్ కోస్ట‌ర్ ఫైట్లు, ర‌కుల్‌తో రొమాన్స్ లు ఏ రేంజ్‌లో ఉంటాయి? వ‌ంటి అంశాల‌న్నీ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. బుధ‌వారం విడుద‌లైన `స్పైడ‌ర్‌` మ‌రి అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఉండ‌నుందా? ఆల‌స్యం ఎందుకు?.. చ‌దివేయండి ఇక‌…
క‌థ‌:
శివ (మ‌హేష్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. క్రైమ్ జ‌రిగిన త‌ర్వాత మ‌నం చేయాల్సింది ఏమీ ఉండ‌దు. క్రైమ్ జ‌ర‌గ‌క‌ముందే ఆప‌గ‌ల‌గ‌డ‌మే గొప్ప అని భావించే మ‌న‌స్త‌త్వం అత‌నిది. ముక్కూ మోహం తెలియ‌నివారికి సాయం చేసి, వారు సంతోషంగా ఉంటే చూసి ఆనందించాల‌నుకుంటాడు శివ‌. ఆ క్ర‌మంలో అత‌ను ప‌బ్లిక్ కాల్స్ ను వింటాడు. కొన్ని ప్ర‌త్యేక అంశాల‌తో స్పెష‌ల్ సాఫ్ట్ వేర్‌ను ఏర్పాటు చేసి త‌న సిస్ట‌మ్‌కు ఏర్పాటు చేసుకుంటాడు. చార్లీ (ర‌కుల్‌) అనే మెడికో కొన్ని పోర్న్ సినిమాలు చూసి బ్లైండ్ డేట్ చేయాల‌నుకుంటుంది. అలా చేస్తేగానీ త‌న చ‌దువుపై దృష్టి పెట్టి ఎక్కువ మార్కులు సాధించ‌లేన‌ని అనుకుంటుంది. ఆమెకు క‌నెక్ట్ అవుతాడు శివ‌. అంత‌లోనే మ‌రో అమ్మాయి స్వ‌రం విని ఆమెకు సాయం చేయాల‌నుకుంటాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆమెతో పాటు, త‌న స్నేహితురాలి ప్రాణం కూడా పోయింద‌ని తెలుసుకుంటాడు. ఆ హ‌త్య‌కు కార‌కుడు భైర‌వుడు అని తెలుసుకుంటాడు. అత‌న్ని వేటాడే స‌మ‌యంలోనే భైర‌వుడి త‌మ్ముడిని హ‌త‌మారుస్తాడు. అవ‌త‌లివారి ఏడుపులో త‌న ఆనందాన్ని వెతుక్కునే బైర‌వుడి ప్లాన్స్ ను తెలుసుకుని, వాటిని విచ్ఛిన్నం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఈ క్ర‌మంలో అత‌నికి ఇంట‌లిజెన్స్ బ్యూరో, పోలీసులు సాయం చేస్తారు. ఆ త‌ర్వాత ఏమైంది? వారి సాయం ఫ‌లించిందా? భైర‌వుడి అంతు చూశాడా శివ‌? చార్లీ కోరిక నెర‌వేరిందా? వ‌ంటివ‌న్నీ స‌స్పెన్స్.
బ‌లాలుః
– మహేష్‌, ఎస్‌జెసూర్య న‌ట‌న‌
– సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ
– నిర్మాణ విలువ‌లు
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

బ‌ల‌హీన‌త‌లుః
– ద‌ర్శ‌క‌త్వం
– క‌థ‌, క‌థ‌నం
– పాట‌లు
– కామెడీ లేక‌పోవ‌డం
వివ‌ర‌ణః
ముందుగా న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే…స్పైడ‌ర్ అనే టైటిల్‌కు త‌గ్గ‌ట్లు మ‌హేష్ ఇందులో స్పై క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ్డాడు. స్టైలిష్‌గా క‌న‌ప‌డ్డాడు. న‌ట‌న ప‌రంగా, డ్యాన్సులు ప‌రంగా మెప్పించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అల‌రించాడు. పాట‌ల్లో అందంగా క‌న‌ప‌డ్డాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌ట‌న‌కు ఆస్కారం లేని పాత్ర‌లో న‌టించింది. పోని గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డిందా అంటే అది కూడా లేదు. డీ గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డింది. క్యారెక్ట‌రైజేష‌న్‌ను స‌రిగ్గా డిజైన్ చేయ‌లేదు. ఎలివేష‌న్ లేదు. ఇక విల‌న్‌గా న‌టించిన ఎస్‌.జె.సూర్య పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఇక భ‌ర‌త్ పాత్ర చిన్న‌దే అయినా, పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇక షాయాజీ షిండే, జ‌య‌ప్రకాష్‌, ఆర్‌జె.బాలాజీ, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడిగా పెద్ద ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. మహేష్ లాంటి హీరో, వంద‌కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ ఇస్తే ఇలాంటి సినిమానా చేసేది అని సినిమా చూసిన ప్రేక్ష‌కుడికి అనిపిస్తుంది. మురుగ‌దాస్ గత చిత్రాల‌తో పోల్చితే బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నంను త‌యారుచేసుకోలేదు. ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే స‌న్నివేశాలు లేవు. క‌థ‌లో లాజిక్స్ మిస్ అయ్యాడు. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్ అయ్యింది. ప్రతి స‌న్నివేశాన్ని ఎంతో రిచ్‌గా క‌న‌ప‌డేలా చేశాడు సంతోష్‌శివ‌న్‌. హేరీష్ జైరాజ్ సంగీతం బాలేదు. ఒక్క ట్యూన్ కూడా మెప్పించ‌లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. మ‌హేష్ అభిమానులు సినిమాను ఓసారి వీక్షించ‌వ‌చ్చునంతే
చివ‌ర‌గాః .స్పైడ‌ర్‌….అంచ‌నాలను అందుకోలేక చ‌తికిల‌ప‌డ్డాడు

రేటింగ్ః 2.75/5

Movie title:- Spyder
Banner:- N V R Cinema
Release date:-27.09.2017
Censor Rating:-“U/A”
Cast:- Mahesh Babu, Rakul Preet Singh, S.J.Suryah
Story:-A.R. Murugadoss
Screenplay:-A.R. Murugadoss
Dialogues:-Paruchuri Brthers
Directed by:- A.R. Murugadoss
Music:- Harris Jayaraj
Lyricist(Single card):-Ramajogayya Sastry
Cinematography:-Santosh Sivan
Editing:-Sreekar Prasad
Stunts by:-Peter Hein
Producer:- N.V. Prasad
Presenter:-Tagore Madhu
Run Time:-145 minutes