స‌మంత‌ను అలా చూసి   చిన్మ‌యి ఏడ్చేసింది

Published On: September 22, 2017   |   Posted By:
స‌మంత‌ను అలా చూసి   చిన్మ‌యి ఏడ్చేసింది
ఏ మాయ చెసావె సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన స‌మంత అగ్ర హీరోయిన్‌గా ఎద‌గ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకోలేదు. త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పిస్తూ ఇప్ప‌టి త‌రం అగ్ర హీరోలంద‌రితో క‌లిసి న‌టించింది. త్వ‌ర‌లోనే అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకోనుంద‌ని ఈ విష‌యం ప‌క్క‌న పెడితే, ఇప్పుడు స‌మంత న‌టించిన తెలుగు సినిమా `రాజుగారిగ‌ది2`. ఈ సినిమాలో స‌మంత ఆత్మ పాత్రలో న‌టించింది. ఈ సినిమా ట్రైల‌ర్ రీసెంట్‌గానే విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేట‌ప్పుడు స‌మంత న‌ట‌న‌కు బౌండ్ అయిపోయాడ‌ట‌. ఈ విష‌యాన్ని థ‌మ‌న్ పాత్రికేయుల‌తో పంచుకోవ‌డం విశేషం.
కాగా ఈ చిత్రంలో స‌మంత రోల్ చాలా హార్ట్ ట‌చింగ్‌గా ఉంటుంద‌ట‌. ఆమెను ఎదో కార‌ణంతో చంపేయ‌డంతో ఆత్మ‌గా మారి, ప్ర‌తీకారం కోసం ఎదురుచూస్తుంటుంద‌ట‌. స‌మంత‌కి రెగ్యుల‌ర్ గా డ‌బ్బింగ్ చెప్పే సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి.. ఈ సినిమాకి కూడా డ‌బ్బింగ్ చెప్పింది. అయితే, డ‌బ్బింగ్ చెపుతూ చెపుతూ చివ‌రికి ఏడ్చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని చిన్న‌యి సోష‌ల్ మీడియాలో తెలియ‌జేసింది.