స‌వ్య‌సాచిలో  మాధ‌వ‌న్ పార్ట్ పూర్త‌య్యింది

Published On: April 17, 2018   |   Posted By:

స‌వ్య‌సాచిలో  మాధ‌వ‌న్ పార్ట్ పూర్త‌య్యింది

నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `స‌వ్య‌సాచి`. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `ప్రేమ‌మ్` పెద్ద హిట్ అయ్యింది. ప్రేమ‌మ్ ల‌వ్‌స్టోరీ.ఇప్పుడు చందు త‌న డైరెక్ష‌న్‌లో రానున్న `స‌వ్య‌సాచి`తో నాగ‌చైత‌న్య‌ను కొత్త‌గా ప్రెజెంట్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ విల‌న్‌గా చేస్తుండ‌టం విశేషం.  భూమిక ఇందులో చైత‌న్య అక్క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారునే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మాధ‌వ‌న్ త‌న పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసేసుకున్నాడు. ఈ విష‌యాన్ని మాధ‌వ‌న్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. ఎన్నో సినిమాల్లో న‌టించాను. ఈ సినిమాలో నిర్మాత‌లు చూపిన కేర్ మ‌ర‌చిపోలేను. మ‌రోసారి ఈ యూనిట్‌తో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.