`స‌వ్య‌సాచి` ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడు?

Published On: March 17, 2018   |   Posted By:

`స‌వ్య‌సాచి` ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడు?

Image result for bharya t v serial in star maa

`స‌వ్య‌సాచి` ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడు?
`స‌వ్య‌సాచి` అన‌గానే అంద‌రికీ అర్జునుడు గుర్తుకొస్తాడు. విల్లును ఎక్కుపెట్టి కుడి చేత్తో బాణాన్ని ఎంత ప‌దునుగా వ‌ద‌ల‌గ‌ల‌డో, ఎడ‌మ చేతితోనూ ఇంచు తేడా లేకుండా బాణాన్ని ప్రయోగించ‌గ‌ల‌డ‌ని ఆయ‌న‌కు ఆ పేరు. కానీ మోడ్ర‌న్ ఎరాలో స‌వ్య‌సాచి అనే ప‌దానికి అర్థం మ‌రింత విస్తృత‌మైంది. ఓ వైపు ఇంటిని, మ‌రోవైపు ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించే మ‌హిళ‌లను గురించి చెప్ప‌డానికి ఆ ప‌దాన్ని ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. అంతే కాదు.. ఓ వైపు పిల్ల‌లు, అత్త‌మామ‌లు, వంట‌, ఇంటి శుభ్ర‌త‌, ఆఫీసు.. వ‌గైరా వ‌గైరాల‌ను మ‌హిళ ఎన్ని చేతుల్తో స‌వ్యంగా నిర్వ‌హించ‌గ‌లుగుతుందో అన్నిటినీ వివ‌రించేలా ప‌లువురు ఆర్టిస్టులు పెయింటింగ్స్ కూడా వేశారు. ఆ మ‌ధ్య `భార్య‌` అనే సీరియ‌ల్ పోస్ట‌ర్‌గానూ ఇదే విష‌యం ప్ర‌త్య‌క్ష‌మైంది. మ‌హిళ వెనుక ప‌లు చేతులు.. ఒక్కో చేతిలోనూ ఆమె చేసే ఒక్కో ప‌నిని సూచించే ఆయుధాల‌తో ఆ పోస్ట‌ర్ క‌నిపించింది. ఆ పోస్ట‌ర్ ప‌లువురిని ఆక‌ట్టుకుంది.
తాజాగా విడుద‌లైన `స‌వ్య‌సాచి` పోస్ట‌ర్‌ను చూసిన వారికి `భార్య‌` సీరియ‌ల్ పోస్ట‌ర్ గుర్తుకొస్తోంది.  ఒక చేతి మీద అక్క అని, మ‌రో చేతిమీద ఇంకేదో సంకేతం.. మ‌రో చేతి మీద ఇంకో ప‌ని… ఇలా నాగ‌చైత‌న్య వెనుక ప‌లు చేతులు.. ఒక్కో చేతి మీద ఒక్కో విష‌యాన్ని రాసి ఉండ‌టం గ‌మ‌నించిన వారంద‌రూ `భార్య‌` పోస్ట‌ర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. పురుషుడు కూడా స‌వ్య‌సాచి. అత‌నికి కూడా ఒక‌టి కాదు.. వంద ప‌నులు అని  విష‌యాన్ని ఓ వైపు చెబుతూనే, మ‌రోవైపు ఈ సినిమాలో హీరో కేర‌క్ట‌రైజేష‌న్‌కి ఉన్న క‌ర్త‌వ్యాల‌ను గురించి ఈ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. సో సినిమా విడుద‌లైన త‌ర్వాత ఈ పోస్ట‌ర్‌లోని విష‌యాలు మ‌రింత స్పష్టంగా స్ఫురిస్తాయేమో. వేచి చూడాల్సిందే.