హలో ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

Published On: December 6, 2017   |   Posted By:
హలో ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
అఖిల్ హీరోగా వస్తున్న రెండో సినిమా హలో. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ నిర్మిస్తోంది. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానున్న హలో సినిమా 50 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసింది. వీటిలో శాటిలైట్, ఆడియో, డబ్బింగ్ రైట్స్ కూడా కలిపి ఉన్నాయి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ఈ సినిమా అటుఇటుగా 38 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రాంతాల వారీగా హలో ప్రీ-బిజినెస్
ఆంధ్రా – రూ. 15 కోట్లు
సీడెడ్ – రూ. 5 కోట్లు
నైజాం – రూ. 11 కోట్లు
రెస్టాఫ్ – రూ. 7 కోట్లు (మిగతా రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్)
టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ – రూ. 38 కోట్లు