హవా సినిమా  మోషన్ టీజర్  లోగో ఫస్ట్ లుక్ విడుదల

Published On: October 12, 2018   |   Posted By:

hawహవా సినిమా  మోషన్ టీజర్  లోగో ఫస్ట్ లుక్ విడుదల

రానా రిలీజ్ చేసిన ‘హవా’ మోషన్ టీజర్ & లోగో ఫస్ట్ లుక్

ఇప్పటి వరకూ తెలుగులో మనం చాలా తక్కువ క్రైం కామెడీ స్టోరీస్ చూశాం. 80ల్లో కిష్కిందకాండ, పరుగో పరుగు 90ల్లో క్షణక్షణం,మని, 2000 తర్వాత అనగనగా ఒక రోజు,స్వామిరారా, భలే మంచి రోజు.. ఇలా చాలా తక్కువ లెక్కలో క్రైమ్ బ్యాక్ డ్రాప్ కామిడీ స్టోరీస్ వచ్చాయి. అలాంటి అరుదైన జాబితాలో చేరేందుకు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు  వస్తోన్న సినిమా ‘‘హవా’’. అంతా కొత్తవారితో రూపొందించిన ఈ సినిమా మోషన్ టీజర్ ను బాహుబలి స్టార్ రానా చేతుల మీదుగా విడుదల చేశారు. మోషన్ టీజర్ చూసిన రానా టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్నోవేటివ్ గా ఉందని మెచ్చుకున్నారు. అలా అంచనాలు లేకుండా విడుదలైన ఈ “హవా” మోషన్ టీజర్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో హల్ చల్  చేస్తూ తన “హవా”ను చూపిస్తుంది.  కారణం.. ఈ టీజర్ డిజైనింగ్. అత్యంత క్రియేటివ్ గా కనిపిస్తోన్న ఈ టీజర్ తోనే వీళ్లు ఏం చూపించబోతున్నారో అర్థమౌతోంది. సస్పెన్స్ అండ్ క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీ క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘9 గంటలలో  9 బ్రెయిన్స్ 9 నేరాలు’ అంటూ పెట్టిన క్యాప్షన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోన.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా అంతా సరికొత్త లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన కొందరు నటీ నటులు కూడా ఈ సినిమాలో  కనిపించబోతున్నారు. ఫిల్మ్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకుడు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని.. శరవేగంగా నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న “హవా” చిత్ర ఆడియో మధుర ఆడియో ద్వార విడుదల కానుంది . అలాగే విడుదల తేదీని కూడ త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటిస్తుండగా.. స్టీఫెన్ మర్ఫీ,జో జోసెఫ్, ఫిబి జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, అన్య మేయెర్, ఆల్వన్ జూనియర్, విలియమ్ ట్రేన్, శ్రీజిత్ గంగాధరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని, సంగీతం : గిఫ్టన్ ఎలియాస్, సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక,  పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, నిర్మాణం : ఫిల్మ్ అండ్ రీల్స్ , దర్శకత్వం : మహేష్ రెడ్డి.