హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బాలయ్య

Published On: February 5, 2018   |   Posted By:

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బాలయ్య

 

కొంత కాలంగా కుడిభుజం గాయంతో బాధపడుతున్న బాలయ్యకు కాంటినెంటల్ హాస్పిటల్ లో సక్సెస్ ఫుల్ గా సర్జరీ నిర్వహించారు. 2 రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉన్న బాలయ్య ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఇంటిలోనే 4 వారాల పాటు రెస్ట్ తీసుకుంటారు. అయితే భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం 5-6 నెలల సమయం పడుతుందని.. అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలని, రిస్కీ స్టంట్స్ చేయడం, బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతానికైతే మరో నెల రోజుల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం కాబోతున్నారు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ-ప్రొడక్షన్ వ్యవహారాలతో పాటు.. రాజకీయ కార్యకలాపాల్ని ఇంటి నుంచే పర్యవేక్షించబోతున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకొస్తారు. ఈ సినిమాకు తేజ దర్శకుడు. వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నారు.