హిట్ కాంబినేషన్ రిపీట్ అయింది

Published On: January 27, 2018   |   Posted By:
హిట్ కాంబినేషన్ రిపీట్ అయింది
మోస్ట్ ఎవెయిటింగ్ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చింది. భీమనేని శ్రీనివాసరావు, అల్లరినరేష్ కాంబినేషన్ లో సుడిగాడు-2 షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. అల్లరినరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సుడిగాడు సినిమా. మళ్లీ ఇన్నేళ్లకు వీళ్లిద్దరి కాంబోలో సినిమా సెట్ అయింది. కాకపోతే ఇది సుడిగాడుకు సీక్వెల్ మాత్రం కాదు.
ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. సునీల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. సో.. దీన్నొక మల్టీస్టారర్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. శ్రీవసంత్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. టాలీవుడ్ కు చెందిన టాప్ కమెడియన్లంతా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర డీటెయిల్స్
వెల్లడిస్తారు.