హిట్ ద‌ర్శ‌కుడితో శ‌ర్వానంద్‌

Published On: September 20, 2017   |   Posted By:
హిట్ ద‌ర్శ‌కుడితో శ‌ర్వానంద్‌
అర్జున్ రెడ్డి సినిమా విడుద‌ల వ‌ర‌కు అనేక వివాదాల‌కు కేంద్ర బిందువైంది. అయితే కంటెంట్‌తో వివాదాల‌కు స‌మాధానం చెప్పి అర్జున్ రెడ్డి చిత్రం సెన్సేష‌న్ హిట్ అయ్యింది. దీంతో దర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా పేరు మారు మోగింది. ఇప్పుడు సందీప్‌రెడ్డి వంగాతో సినిమాలు చేయాల‌ని చాలా మంది నిర్మాత‌లు, హీరోలు భావిస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా మాత్రం త‌న త‌దుప‌రి చిత్రాన్ని యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌తో చేయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.
నిజానికి సందీప్ రెడ్డి వంగా త‌న అర్జున్‌రెడ్డి క‌థ‌ను ముందు శ‌ర్వానంద్‌తోనే చేయాల‌ని భావించాడు. కానీ శ‌ర్వానంద్ కొన్ని కార‌ణాల దృష్ట్యా, శ‌ర్వానంద్, అర్జున్‌రెడ్డి  సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో అవ‌కాశం విజ‌య్ దేవ‌ర కొండ‌కు ద‌క్కింది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఇప్పుడు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి శ‌ర్వానంద్ ఒకే చెప్పేశాడు. ప్ర‌స్తుతం క‌థ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయి.