హిప్పీ’ మూవీ రివ్యూ

Published On: June 6, 2019   |   Posted By:

పాత పిప్పే (‘హిప్పీ’ మూవీ రివ్యూ) 

రేటింగ్  :  2.0/5

దేవ‌దాస్ అలియాస్ హిప్పీ (కార్తికేయ‌) ఓ సరదా కుర్రాడు. ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడో ఏమో  స్నేహ (జ‌జ్బాసింగ్‌) తో ప్రేమలో ఉంటాడు. ఆమె కూడా ఈ రిలేషన్ ని  పెద్ద సీరియస్ గా తీసుకోదు. ఈ లోగా స్నేహతో లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన హిప్పీకు ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ) పరిచయం అవుతుంది. ఆమెతో ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె లేనిదే బ్రతకలేను అనిపిస్తుంది. ట్రైల్స్ వేస్తూంటే గమనించిన స్నేహ మనతో పని లేనట్లుంది బాబుకి అని గ్రహించి బై చెప్పి పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఈ లోగా హిప్పీని కరుణించిన ఆముక్త మాల్యద లవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి లివ్ ఇన్ రిలేషన్ షిప్ కు సై అంటుంది.  అయితే నువ్వు నాకే సొంతం అంటూ రకరకాల కండీషన్స్ పెడుతుంది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తట్టుకోలేకపోతాడు హిప్పీ.  ఆమెను వదిలించుకోవాలని ట్రై చేసి చివరకు బ్రేకప్ అంటాడు. చివరకు వీళ్లద్దరు ఒకటి ఎలా అయ్యారనేది మిగతా కథ. అలాగే ఈ కథలో హిప్పీ బాస్ (జెడి చక్రవర్తి) పాత్రేమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
కథ,కథనం ఎలా ఉంది…
 
‘ఆర్‌ ఎక్స్‌ 100’తో ఓవర్ నైట్ లో స్టార్ గా అయిన   కార్తికేయ రెండో చిత్రం అనగానే ఖచ్చితంగా జనాల్లో ఆసక్తి ఉంటుంది. ట్రేడ్ లో ఉత్సాహం ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవటానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది తప్ప..సినిమాలో ఏదో పెద్ద కథ ఉందని నిర్మాత ఓకే చేసిన సినిమాలా అనిపించదు. హిప్పీ సినిమాకు అసలైన సమస్య  సోల్ లేకుండా చాలా ప్రెడిక్టుబుల్ గా కథ నడపటమే. లవ్ స్టోరీ కూడా ఏదో చూసాం..చేసాం అన్నట్లుగా ఉంటుంది. చాలా పలచటి స్టోరీ లైన్ కు అంతకన్నా డల్ గా ఉండే స్క్రీన్ ప్లే చేసారు.   

కథ లో పాయింట్ గతంలో ఆరెంజ్ (రామ్ చరణ్) వంటి వారి సినిమాల్లో వచ్చినదే కొత్తదేమీ కాదు. పోనీ సీన్స్ అయినా కొత్తగా రాసుకున్నారా అంటే అదీ లేదు. బాగా నీరసంగా రాసిన రెగ్యులర్ మోడ్రన్ డే లవ్ స్టోరీ. లవ్..బ్రేకప్ వంటి విషయాలకు హాట్ సీన్స్ అనే మసాలా కలిపి వడ్డించారు. ప్రతీ పాత్ర సెక్స్ గురించి మాట్లాడుతూంటుంది. ద్వందార్దాలు అయితే యూత్ నే టార్గెట్ చేసారు. బి,సి సెంటర్లకు అవి నచ్చుతాయోమో కానీ ఫ్యామిలీకు పట్టవు. ఫస్టాఫ్ రొమాన్స్ తోనూ, కొద్ది పాటి యాక్షన్, ఫన్ తో ఫిల్ చేసారు. అది బాగానే ఉంది. అయితే సెకండాఫ్ మాత్రం ఆ స్దాయిలో ఉండవు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ తప్ప చెప్పుకోదని స్టఫ్ సినిమాలో లేదు. 
 
టెక్నికల్ గా …

సాంకేతికగంగా ‘హిప్పి’లో మంచి క్వాలిటీ రూపొందించారు. కథ,కథనంలో ఆ క్వాలిటీ లేదు కానీ సినిమాకు పని చేసిన మిగతా డిపార్టమెంట్స్ అందరూ తమ ప్రతిభను పతాక స్దాయిలోనే ప్రదర్శించారు.  నివాస్ ప్రసన్న పాటలు గొప్పగా  లేవు కానీ.. జస్ట్ అనినిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే. ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. గోవా ఎపిసోడ్ అదరకొట్టారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.  అయితే అంత పెద్ద నిర్మాత తీయదగ్గ సినిమా కాదు. అలాగే దర్శకుడు టి.ఎన్.కృష్ణ  పనిగట్టుకుని ‘ఆర్ ఎక్స్ 100’తో కార్తికేయకు వచ్చిన పేరు క్రేజ్ మొత్తం నాశనం చేసేలా ప్రయత్నం చేసాడనిపించింది.   

చూడచ్చా…

ఖచ్చితంగా అయితే టైమ్, డబ్బు మరీ ఎక్కువైతే తెరమీద లేదా అమెజాన్ ప్రైమ్ లోనో, టీవీలోనో

తెర వెనక ..ముందు

నటీనటులు: కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బాసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు
సంగీతం:  నివాస్‌ కే ప్రసన్న
సినిమాటోగ్రఫీ:  రాజశేఖర్‌
కూర్పు:  ప్రవీణ్‌ కేఎల్
నిర్మాణ సంస్థ: వీ క్రియేషన్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీఎన్‌ కృష్ణ
విడుదల తేదీ: 6-06-2019