హీరోయిన్‌ సుర‌భి ఆశ‌లు

Published On: August 16, 2017   |   Posted By:

హీరోయిన్‌ సుర‌భి ఆశ‌లు

చెన్నై సొగ‌స‌రి సుర‌భి కెరీర్ ప్రారంభంలో రెండు త‌మిళ సినిమాల్లో న‌టించింది. త‌ర్వాత బీరువా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత ఎటాక్‌, ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్‌మేన్ చిత్రాల్లో న‌టించింది. సుర‌భి న‌టించిన గ‌త తెలుగు చిత్రం జెంటిల్‌మేన్ మంచి విజ‌యం సాధించినా అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

అయితే ఇప్పుడు మ‌రో కొత్త సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంది. ఆ సినిమా మ‌రేవ‌రిదో కాదు. అల్లు శిరీష్‌ది. శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ సినిమా చేస్తున్నాడు. టెక్నిక‌ల్ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగతోంది. ఈ సినిమాలో సురభి ఓ టీవీ న‌టి పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అలాగే మంచు విష్ణు వోట‌ర్ చిత్రంలో కూడా సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ప్ర‌స్తుతం సుర‌భి ఈ రెండు సినిమాల‌పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకుంది. ఈ ఆశలు నేర‌వేరి స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ కావాల‌ని కోరుకుందాం.