హీరో కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ

Published On: July 15, 2020   |   Posted By:
హీరో కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ
 
హీరోగా ఫస్ట్ బర్త్ డే  జరుపుకోవడం సంతోషంగా ఉంది – కిరణ్ అబ్బవరం
 
రాజవారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం త్వరలో ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, అలాగే సబాస్ట్రియన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలింలో నటించబోతున్నాడు.
 
జులై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…
 
బిటెక్ తరువాత బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే వాడిని సినిమాల్లో నటించాలని ఆశక్తితో ఉన్న నాకు నా సీనియర్ చేయబోయే గచ్చిబౌలి షాట్ ఫిలింలో నటించాను. అలా ఇండస్ట్రీకి దగ్గరయ్యను. బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చి కొన్ని షార్ట్ ఫిలింస్ లో నటించాను. ఆ సందర్భంలో రాజవారు రాణిగారు సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. 
 
రాజవారు రాణిగారు సినిమా విడుదలై మంచి గుర్తింపు లభించింది. తరువాత ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమాకు రెండో సినిమాకు కథ పరంగా, నా పాత్ర పరంగా చాలా వ్యత్యాసం ఉంది. ఎస్.ఆర్.కల్యాణమండపం చిత్రం 40 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సాయికుమార్ గారు ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. 
 
ఎస్.ఆర్.కల్యాణమండపం తరువాత బాలాజీ అనే నూతన దర్శకుడితో సబాస్ట్రియన్ అనే సినిమాలో నటించబోతున్నాను. ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను, ఇద్దరు హీరోయిన్స్ నటిస్తోన్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించబోతున్నారు. 
 
జులై 15న నా పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారు ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా పోస్టర్ ను విడుదల చెయ్యడం, అలాగే సబాస్ట్రియన్ సినిమాను డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అనౌన్స్ చెయ్యడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాలతో పాటు మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాను త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాను.