హీరో కోసం వెదుకుతున్న హరీష్ శంకర్

Published On: August 7, 2017   |   Posted By:
హీరో కోసం వెదుకుతున్న హరీష్ శంకర్
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తన కొత్త సినిమాకు లొకేషన్లు వెదికే పనిలో ఉత్తర అమెరికాను జల్లెడ పడుతున్నాడు ఈ దర్శకుడు. ఈ మేరకు ఈమధ్యే కొన్ని ఫొటోల్ని కూడా ట్విట్టర్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడా లొకేషన్  వేట ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకురాబోతున్నాయి.
ఇక సినిమాకు సంబంధించి హీరోను వెదికే పని ప్రారంభించాడట హరీష్  శంకర్. హీరోల్ని డిఫరెంట్ గా చూపించడం హరీష్ స్టయిల్. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బన్నీని బ్రాహ్మణ కుర్రాడిగా చూపించిన హరీష్.. తన ప్రతి సినిమాలో హీరోలను మోస్ట్ స్టయిలిష్  గా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా కోసం అతడు ఏ హీరోను ఎంపిక చేసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.
హీరో ఎవరైనా హరీష్ శంకర్ అప్  కమింగ్ మూవీ  మాత్రం దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుంది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ స్వయంగా వెల్లడించాడు.  డీజే సినిమాను దిల్ రాజుకు చేసిచ్చిన హరీష్.. తన నెక్ట్స్ సినిమాను కూడా దిల్ రాజుకే చేయబోతున్నట్టు తెలిపాడు. ఆ సినిమా తర్వాత తను నిర్మాతగా మారి చిన్న సినిమాలు చేస్తానంటున్నాడు హరీష్.