హ్యాపీ బర్త్ డే టు నిఖిల్

Published On: June 1, 2018   |   Posted By:

హ్యాపీ బర్త్ డే టు నిఖిల్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన అభిమాన సంఘాలు.. నిఖిల్ ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు అందిస్తున్నారు. వీళ్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలామంది నిఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు నిఖిల్. ఆ మూవీలో నిఖిల్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. హ్యాపీ డేస్ తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఫెయిల్ అయ్యాడు.

2013లో వచ్చిన స్వామిరా రారా సినిమాతో మళ్లీ స్వింగ్ లోకి వచ్చాడు నిఖిల్. ఇక అక్కడ్నుంచి వరుసగా హిట్స్ అతడ్ని పలకరించుకుంటూ వచ్చాయి. కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, కేశవ, కిరాక్ పార్టీ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం కనిథన్ రీమేక్ లో నటిస్తున్న నిఖిల్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.