హ్యాపీ బర్త్ డే టు శంకర్

Published On: August 17, 2017   |   Posted By:

హ్యాపీ బర్త్ డే టు శంకర్

సినిమాకు భారీతనం తీసుకొచ్చిన దర్శకుడు అతడు. కొత్తదనం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసే స్పృహ ఉన్న దర్శకుడు. అతడే ఒన్ అండ్ ఓన్లీ శంకర్. ఇండియన్ సినిమాకు భారీతనం అంటే ఏంటో రుచిచూపించినే ఈ దర్శకుడు ఈరోజు (17-08-17) తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఇండియన్ సినిమాకు చెందిన ఎంతోమంది సినీప్రముఖులు శంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన శంకర్, ఏదో సాధిద్దామని మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. కానీ అనుకోకుండా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. పైగా అనుకోకుండా ఆఫర్ కూడా వచ్చింది. అలా స్క్రీన్ రైటర్ గా కెరీర్ ప్రారంభించాడు శంకర్. అప్పటికే స్టేజ్ షోలు వేసిన అనుభవంతో నటుడు అవ్వాలనుకున్నాడు. కానీ యాధృచ్ఛికంగా డైరక్టర్ అయ్యాడు.

అనుకోకుండా ఆఫర్ వచ్చినా అందులో తన మార్క్ చూపించాలనుకున్నాడు శంకర్. అందుకే విలక్షణమైన కథలు ఎంచుకున్నాడు. అలా జెంటిల్ మేన్ తో దర్శకుడిగా మారిన శంకర్, ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జీన్స్, భారతీయుడు, బాయ్స్, శివాజీ, అపరిచితుడు, రోబో ఇలా శంకర్ కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా భారతీయ సినీచరిత్రలోనే అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా 2.0 సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శక ధీరుడు. శంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.