హ్యాపీ బర్త్ డే రాజేంద్ర ప్రసాద్

Published On: July 19, 2017   |   Posted By:
హ్యాపీ బర్త్ డే రాజేంద్ర ప్రసాద్
ఆయన పుట్టిన తర్వాతే హాస్యం పుట్టిందేమో అనిపిస్తుంది. అంతలా తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు హాస్య చక్రవర్తి, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్. నిజానికి సినిమాల్లోకి వస్తూనే కామెడీ పండించాలనుకోలేదు ఆర్పీ. మొదట ఆయన వేసినవన్నీ విలన్ వేషాలే. తేనె పూసిన కత్తి టైపు పాత్రలే. జంధ్యాల పరిచయం రాజేంద్రప్రసాద్ గమ్యాన్ని మార్చేసింది. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. అలా సీరియస్ నటుడి నుంచి కామెడీ హీరోగా ఎదిగారు రాజేంద్రప్రసాద్.
అప్పటివరకు ఆయనలో అంత కామెడీ టైమింగ్ ఉందని ఎవరూ ఊహించలేదు. ఆయన గాత్రంలో అంత హాస్యం పండుతుందని కలలో కూడా అనుకోలేదు. అలా తెరపైకి ఉవ్వెత్తున ఎగిసిన రాజేంద్ర ప్రసాద్.. వరుస సినిమాలతో హిట్స్ అందుకున్నాడు.
1956, జులై 19న జన్మించిన రాజేంద్రప్రసాద్, బాపు దర్శకత్వంలో వచ్చిన స్నేహం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు అనే సినిమాలో ఆర్పీ చేసిన పాత్ర ఆయన కెరీర్ లో మొదటి టర్నింగ్ పాయింట్. వంశీ, జంధ్యాల రాకతో రాజేంద్రప్రసాద్ కెరీర్ ఊపందుకుంది. కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్న రాజేంద్రప్రసాద్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.కామ్.