హ్యాపీ బ‌ర్త్‌డే టు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌

Published On: August 9, 2017   |   Posted By:
హ్యాపీ బ‌ర్త్‌డే టు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌
తెలుగు సినిమాల్లో నూతనత్వాన్ని నింపి, అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌గా నిలిచిపోయిన తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ నుండి నటవారసత్వాన్ని మరో స్థాయికి తీసుకెళుతూ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌కి ఇమేజ్‌లా ఉంటూ తండ్రి అందించిన బాధ్యతను నేరవేరస్తూ ముందుకు సాగడం మహేష్‌కే చెల్లింది. అభిమానులు కోరుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, మెసేజ్‌ ఇస్తూ అమ్మాయిల కలల రాజకుమారుడుగా, యూత్‌ ఐకాన్‌గా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా తనతో సినిమాలు చేసే దర్శ, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ కలెక్షన్స్‌ కల్పతరువుగా, తెలుగు సినిమా మార్కెట్‌ దూకుడుని పెంచి తెలుగు పేక్షకుడికి గుండెల్లో చెరిగిపోని అభిమాన ధనాన్ని సంపాదించుకున్న ‘శ్రీమంతుడు’ సూపర్‌స్టార్‌ మహేష్‌.
బాలనటుడు టు సూపర్‌స్టార్‌…
బాలనటుడిగా సినిమాల్లోకి నీడ సినిమాతో రంగ ప్రవేశం చేసి దర్శకరత్న దాసరితో పాటు, ప్రముఖ దర్శకుడు డూండీతో భవిష్యత్‌ సూపర్‌స్టార్‌గా ప్రశంసలు అందుకున్న మహేష్‌, శంఖారావం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నతమ్ముడు వంటి చిత్రాల్లో తనదైన నటనతో మురిపించి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో విడుదలైన రాజకుమారుడు చిత్రంతో తొలిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయమైన తిరుగులేని సక్సెస్‌ను సాధించిన ప్రిన్స్‌ మహేష్‌బాబు తొలి చిత్రంతోనే నూతన ఉత్తమ నటుడుగా స్పెషల్‌ జ్యూరీ ‘నంది అవార్డ్‌’ అందుకున్నారు.
తెలుగు అనుంబంధాలకు, అప్యాయతలకు అద్దం పడుతూ మనిషికి కావాల్సింది సంకల్పబలం అది ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రియేటివ్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో మురారి చిత్రంతో ప్రూవ్‌ చేసే క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఈ చిత్రానికిగానూ ఉత్తమనటుడిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డుని సొంతం చేసుకున్నారు.
లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడమే కాకుండా ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ అవార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా వరుస విజయాలతో దూసుకొచ్చిన మహేష్‌ తీసుకున్న టర్న్‌ అతడు.స్టార్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహేష్‌ నటనలోని కొత్త కోణాని ఆవిష్కరించింది.
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పోకిరి చిత్రంతో మహేష్‌ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాశారు. ఆ సినిమాతో తెలుగు సినిమా వైపు మొత్తం ఇండియన్‌ సినిమానే తిరిగి చూసేలా కొత్త రికార్డులను సృష్టించారు.
ఇదే హవాను దూకుడుతో మరోసారి ప్రూవ్‌ చేశారు. తనదైన కామెడి టైమింగ్‌తో నవ్విస్తూనే విలన్స్‌ భరతం పట్టే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తెరపై నట ప్రభంజనాన్ని క్రియేట్‌ చేసి మరోసారి నంది అవార్డుని సొంతం చేసుకున్నారు.
బిజినెస్‌మేన్‌ చిత్రంతో మరో సూపర్‌డూపర్‌ సక్సెస్‌ను కొట్టి బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తాను తెలియజేశారు.
మల్టీస్టారర్‌ చిత్రాలకు మళ్లీ నాంది పలికిన మహేష్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో విక్ట్టరీ వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌లో నటించి మల్టీస్టారర్‌ చిత్రాల ట్రెండ్‌కు నాంది పలికి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తండ్రికి తగ్గ తనయుడుగా ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయడంలో తానుముందుటానని ‘టక్కరిదొంగ’ చిత్రంలో కౌబాయ్‌గా కనిపించడమే కాకుండా మరోసారి ఉత్తమ నటుడిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ను కైవసం చేసుకున్న మహేష్‌ నిజం, నాని నేనొక్కడినే వంటి సైకలాజికల్‌ థ్రిల్లర్‌, బ్రహ్మూెత్సవం వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో మరోసారి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో తానెప్పుడూ ముందుటానని చెప్పారు.
అభిమానధనుడు…’శ్రీమంతుడు’గా సెన్సేషన్‌ హీరో కోట్లకు పడగలెత్తాడు, అయినా తనకు సింపుల్‌గా ఉండాలంటేనే ఇష్టం. కష్టాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దాని రూపు రేఖలు మార్చేస్తాడు. ఈ కథ వినడానికి సంపుల్‌గా ఉంది కదా..అని ఎవరైనా అనుకుంటారు. కానీ సూపర్‌స్టార్‌ మహేష్‌ అలా అనుకోలేదు.
దర్శకుడు కొరటాల చెప్పిన లైన్‌ నచ్చి వెంటనే సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరు కోసం ఏదైనా చేయాలనే సందేశంతో కాకుండా ఆచరణలో బుర్రిపాలెంతో పాటు  తెలంగాణ‌లో, సిద్ధాపురం అనే మ‌రో గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని వాటి అబివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమంటే ‘శ్రీమంతుడు’ చిత్రం కాన్సెప్ట్‌ నచ్చడంతోఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌ను స్థాపించి, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి శ్రీమంతుడు చిత్రాన్ని నటిస్తూ నిర్మించారు. అభిరుచి గల నిర్మాతగా తనెంటో ప్రూవ్‌ చేసుకున్నారు.
‘స్పైడర్‌’తో తమిళంలోకి ఎంట్రీ….
ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన మహేష్‌కి తమిళంపై మంచి పట్టు ఉంది. మంచి కథ దొరికితే తమిళంలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అదే సమయంలో స్టార్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌ చెప్పిన ‘స్పైడర్‌’ కథ నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాతగా 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది ‘స్పైడర్‌’. తెలుగు, తమిళంలో శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇటు అభిమానుల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్రెడి విడులైన ఫస్ట్‌లుక్‌ను ఎక్స్‌ట్రార్డినరి రెస్పాన్స్‌ వచ్చింది. రీసెంట్‌గా విడుదలైన బూమ్‌ బూమ్‌ సాంగ్‌ రెండు మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను రాబట్టుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తున్నారు. ‘స్పైడర్‌’ చిత్రంతో మహేష్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేయడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.
కొరటాల శివతో హిట్‌ మ్యాజిక్‌ రిపీట్‌
‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత మహేష్‌ హీరోగా కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్ర చేస్తుండటం విశేషం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆసక్తి రేపుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌
మహేష్‌ హీరోగా మెగా ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌, హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ చిత్రంతో పాటు, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, మైత్రీ మూవీస్‌ కాంబినేషన్‌లో మరో క్రేజీ మూవీ రూపొందనుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఆల్‌ ఇండియా గ్రేట్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్‌.నారాయణ నిర్మాతగా ఓ భారీ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉంది. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇలా అందరి అంచనాలను మించుతూ బాక్సాఫీస్‌ వద్ద దూకుడును చూపుతున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు ఆగస్ట్‌ 9. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.
లక్నోలో సూపర్‌స్టార్‌ మహేష్‌ చిత్రం షెడ్యూల్‌
పోరు తప్పదు.. ఒకేరోజు 3 సినిమాలు