హ్యాపెనింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ సింగ్ కి హ్యాపీ బర్త్ డే

Published On: October 10, 2017   |   Posted By:
హ్యాపెనింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ సింగ్ కి హ్యాపీ బర్త్ డే
టాలీవుడ్ లో ప్రస్తుతం హయ్యస్ట్ క్రేజ్ తో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్   . బడా హీరోలతో సినిమాలు చేస్తూ, కుర్రహీరోల హృదయాల్లో చోటుసంపాదించుకున్న ఈ బ్యూటీ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. టాలీవుడ్ ప్రముఖులంతా రకుల్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.
అందాల పోటీల్లో పాల్గొని వరుసగా 5 టైటిల్స్ నెగ్గిన ఈ అందగత్తె ఢిల్లీలో పుట్టిపెరిగింది. 5 అడుగుల 6 అంగుళాల హైట్ ఉన్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. మోడలింగ్ నుంచి శాండిల్ వుడ్ (కన్నడి చిత్రసీమ)లోకి ఎంటరైంది. అయితే అక్కడామె గిల్లీ అనే ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ వెంటనే టాలీవుడ్ కు షిఫ్ట్ అయింది.
కెరటంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో లైమ్ లైట్లోకి వచ్చింది. ఇక అప్పట్నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం.. తాజాగా స్పైడర్ సినిమాలతో స్టార్ హీరోల హాట్ ఫేవరెట్ గా మారింది రకుల్. ప్రస్తుతం తమిళ్ లో 2, హిందీలో ఒక సినిమా చేస్తూ తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంది ఈ బుట్టబొమ్మ.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ రకుల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.