అతడు ఆమె ప్రియుడు చిత్రంలో హీరోగా బెనర్జీ

Published On: August 11, 2021   |   Posted By:

అతడు ఆమె ప్రియుడు చిత్రంలో హీరోగా బెనర్జీ

సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు బెనర్జీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి  “అతడు, ఆమె – ప్రియుడు” అనే టైటిల్ ఖరారు చేసారు.


యండమూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  అయన  ఒక ఆస్ట్రోనమి ప్రొఫసర్ గా నటిస్తున్నాడు.  ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్య క్రమాలు ప్రారంభమయ్యయి.. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ .. “…ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది.  భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ” అని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

ఈ చిత్రంలో బెనర్జీ, సునీల్, కౌశల్, సుపూర్ణ తదితరులు నటిస్తున్నారు. రచన, దర్శకత్వం : యండమూరి వీరేంద్రనాద్.