అమ్మోరు తల్లి మూవీ రివ్యూ

Published On: November 15, 2020   |   Posted By:

అమ్మోరు తల్లి మూవీ రివ్యూ

సెటైర్లలతో గిల్లి…: ‘అమ్మోరు తల్లి’ రివ్యూ

Rating: 2.5/5

కొన్ని సినిమాలు పోస్టర్, ట్రైలర్ చూడగానే ఎలాగైనా చూడాలని ఫిక్సైపోతాం. అలాంటి ఉత్సాహాన్ని కలిగించిన సినిమాల్లో ఒకటి అమ్మోరు తల్లి. ట్రైలర్ మంచి ఫన్నిగా ఉంటూ సినిమాపై ఆసక్తిని కలగచేసింది. ముఖ్యంగా నయనతార ఫ్యాన్స్, కామెడీ సినిమాలు ఇష్టపడేవాళ్లు రిలీజ్ డేట్ నోట్ చేసుకుని ఎదురుచూసేలా చేసింది. దానికి తోడు తమిళనాట కమెడియన్‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌జే బాలాజీ దర్శకుడిగా మారటం కూడా సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని కలగచేసింది. తమిళనాట  మూకూతి అమ్మన్‌గా వచ్చిన ఈ సినిమాలో తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదల చేసారు. నయనతార ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి..చూసే కంటెంట్ ఉందా..నవ్వుకోవచ్చా లేదా సినిమా నవ్వులు పాలైందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..పదండి.

స్టోరీ లైన్

రామస్వామి (ఆర్జే బాలాజి) ఓ న్యూస్ రిపోర్టర్. ఏదో ఒక స్కూప్ లాగి సెన్సేషన్ చేసి, తను పెద్ద ఛానెల్ లోకి జంప్ అవ్వాలనేది అతని ఆశయం. ఆ ఆశయం నెరవేర్చుకోవటానికి ఓ స్కూప్ పట్టుకుంటాడు. కానీ పట్టుదొరకదు. దేవుడు పేరు చెప్పి 11 వేల ఎకరాలను భాగవతి బాబా (అజయ్ ఘోష్) బండారం బయిటపెట్టాలని తిరుగుతూంటాడు. కానీ ఎవరూ అతన్ని లెక్క చెయ్యరు. దాంతో నిరాశలో ఉంటాడు. మరోప్రక్క అతని తల్లి బంగారం (ఊర్వశి) కి కూడా ఏ పని ముందుకు వెళ్లటం లేదని బాధపడుతూంటుంది. దానికి పరిష్కారం తమ కుల దేవత అయిన ముక్కుపుడక అమ్మవారు (నయనతార)కు మ్రొక్కు తీర్చుకోవటమే అని వెళ్లి దర్శించుకుంటారు. అయితే అక్కడే రామస్వామి జీవితంలో ఓ మలుపు వస్తుంది. అమ్మవారు అతనికి స్వయంగా వచ్చి దర్శనమిస్తుంది.  తన పేరు చెప్పి దొంగబాబా కబ్జా చేస్తున్న పంచావనాన్ని కాపాడుకోవటం కోసం వచ్చానని చెప్తుంది. మొదట నమ్మకపోయినా ఆ తర్వాత నమ్మి ఆమె ఎందుకు వచ్చిందో కనుక్కుంటాడు.అక్కడ నుంచి అమ్మవారితో కలిసి రామస్వామి ఆ బాబాపై ఎలా ఫైట్ చేసారు. చివరకు ఏమైంది..అమ్మవారి వలన రామస్వామి జీవితంలో ఏ మార్పులు వచ్చాయి..అసలు అమ్మవారు వచ్చి ..రామస్వామికే కనపడటంలో అంతరార్దం ఏమిటి అనేది మిగతా కథ.
 
స్క్రీన్ ప్లే …

స్ట్రైయిట్ నేరేషన్ లో సాగిన ఈ కథ ఓ సెటైర్ గా సాగింది. దేవుళ్లు..వాళ్ల స్దలాలు కబ్జా..దేవుళ్లు ఏం చేయరు కదా అనే ధైర్యం కల దొంగబాబాల ధైర్యం వ్యంగ్యాత్మకంగా చూపిస్తుంది. ఈ క్రమంలో వర్తమాన విషయాలపై కూడా సెటైర్స్ వేసుకుంటూ దర్శకుడు స్క్రిప్టు ప్రయాణం చేసారు. ఈ ఐడియా వరకూ బాగానే ఉంది కానీ దాన్ని ట్రీట్మెంట్ చేసే క్రమంలోనే తడబడినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ పన్నీగా నడిపిన దర్శకుడు ఆ తర్వాత మెల్లిగా పట్టుకోల్పోయి.క్లైమాక్స్ కు వచ్చేసరికి పూర్తిగా పడిపోయాడు. ఫస్టాఫ్ లో సెట్ చేసిన ప్రిమైజ్ కు అనుగుణంగా సెకండాఫ్ రన్ కాలేకపోయింది. ఎక్కువగా మోసకారి బాబాలు,లాండ్ స్కామ్ లు చేయటం మీదే దృష్టి పెట్టి…సినిమాని కొన్ని చోట్లో మెసేజ్ లతో నింపేసారు. అయితే నేరేషన్ కొత్తగా ఉండటం, కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉండటం కలిసొచ్చింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సీన్స్ అయితే దండిగానే ఉన్నాయి. అయితే ఇంత చేసినా కథనం చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండటం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేపధ్యం కొత్తగా ఉన్నా..పాత సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. బాలాజి స్క్రిప్టు విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది అనిపిస్తుంది. కొత్త మలుపులు ఉంటే ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లేది.

టెక్నికల్ గా..

సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ రెండు బాగున్నాయి. అయితే ఈ సినిమాలో పాటలే బాగోలేదు. ఎడిటింగ్ లెంగ్త్ లు కట్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. డైరక్షన్ అద్బుతం అని కాదు కానీ బాగుంది. డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు నయనతార పెద్ద ఎసెట్. ఆమె లేకుండా ఈ సినిమాని ఊహించలేం. ఆర్ జే బాలాజీ తన రోల్ లో ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారు కానీ కొన్ని చోట్ల అతి చేస్తున్నట్లు అనిపిస్తుంది. నయనతార పాత్రను తగ్గించి తనే హైలెట్ అవుదామని ప్రయత్నిస్తున్నట్లు కనపిస్తుంది. అజయ్ ఘోష్ ..ఈ సినిమాలో మరో హైలెట్.
 
చూడచ్చా

మరీ తీసి పారేసే సినిమా కాదు..ఓ సారి చూడచ్చు.
 

తెర వెనక,ముందు 

నటీనటులు: నయనతార, ఆర్‌.జె.బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్‌, మధు, అభినయ, అజయ్‌ ఘోష్‌, తిరునవక్కరసు, మౌళి తదితరులు
సంగీతం:  గిరీష్‌ గోపాలకృష్ణన్‌
సినిమాటోగ్రఫీ: దినేష్‌ కృష్ణన్‌.బి
ఆర్ట్: విజయ్‌కుమార్‌.ఆర్‌
ఎడిటర్‌: సెల్వ ఆర్‌.కె
స్క్రీన్‌ ప్లే: ఆర్‌.జె.బాలాజీ & టీమ్‌
మాటలు: కె.ఎన్‌.విజయ్‌కుమార్‌
పాటలు: రెహ్మాన్‌
కొరియోగ్రఫీ: దినేష్‌
కథ, స్క్రీన్ ప్లే: ఆర్‌.జె.బాలాజీ & ఫ్రెండ్స్‌
దర్శకత్వం:  ఆర్‌.జె.బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌
నిర్మాత: ఐసరి కె.గణేష్‌
రన్ టైమ్:  2గంటల, 15 నిముషాలు
విడుదల: 14,నవంబర్ 2020
ఓటీటి: (డిస్నీ+హాట్‌స్టార్‌)