అర్జున్ సుర‌వ‌రం మూవీ రివ్యూ

Published On: November 29, 2019   |   Posted By:

అర్జున్ సుర‌వ‌రం మూవీ రివ్యూ


Rating: 2.25/5

కెరీర్ బాగుంది అనుకున్న టైమ్ లో వరస ఫ్లాఫ్ లు వస్తే చేయగలిగేది ఏముంటింది. విభిన్నమైన సినిమాలు అనుకున్నవి వికృతంగా మారి భయపెడితే చేసేదేముంటుంది..వరసగా కేశవ, కిరాక్ పార్టీ సినిమాలతో కెరీర్ మొదట్లో ఉన్న ఫేజ్ కు  వేగంగా వెళ్లిపోయాడు నిఖిల్. ఏడాది క్రితం పూర్తైన ‘అర్జున్ సుర‌వ‌రం’   రకరకాల కారణాలతో వాయిదాలు పడి ఇన్నాళ్ళకు బయిటకు వచ్చింది. ఈ సినిమా క్లిక్ అయితే.. నిఖిల్ కెరీర్ మళ్లీ గాడిన పడుతుంది. లేదంటే చాలా కష్టం. చదువులు, నకిలీ సర్టిఫికేట్లు, ఎగ్జామ్స్ లాంటి ఎలిమెంట్స్ టచ్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..కథేంటి.. నిఖిల్  కెరీర్ కు  టెస్టింగ్ టైమ్ లా వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ అతనికి ప్లస్ అవుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అర్జున్ లెనిన్ సుర‌వ‌రం (నిఖిల్‌) ఓ టీవి ఛానెల్ లో జర్నలిస్ట్. వృత్తిని ఉద్యోగంలా కాకుండా ఓ సామాజిక భాధ్యతగా భావించి చేస్తూంటాడు. తన భవిష్యత్ జీవితాన్ని బీబీసిలో జర్నలిస్ట్ గా గడపాలని ప్లాన్ చేసుకుంటాడు. ఈ లోగా ఓ బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాడు. కానీ ఆ లోన్ కోసం పెట్టిన తన సర్టిఫికేట్స్ ఫేక్ అని, బ్యాంక్ ని మోసం చేయబోయాడని అభియోగాలు వస్తాయి. అర్జున్ ని అరెస్ట్ చేస్తారు. తను నకిలి సర్టిఫికేట్స్ తీసుకోవటం ఏమిటి అని మొదట కంగారుపడ్డా ఆ తర్వాత ఈ విషయం వెనక పెద్ద స్కామ్ ఉందని తన జర్నలిస్ట్ నేత్రం తో కనుగొంటాడు. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికేట్స్ రూపొందించే  ఓ పెద్ద  క్రైమ్ సిండికేట్ ఉందని తెలుస్తుంది. ఆ మాఫియాని బయిటపెట్టే క్రమంలో అర్జున్ కు అనుకోని అవాంతరాలు అనేకం ఎదురౌతాయి. అవేమిటి..చివరకు ఏమైంది. ఎవరు ఈ నకిలీ సర్టిఫికేట్స్ చేస్తున్నది , ఈ కథలో  కావ్య (లావణ్య త్రిపాఠి) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
పాత టెంప్లేట్ లోనే…

కొత్త పాయింట్ ని కొత్తగానే  చెప్పాల్సిన  రోజులివి. అలా కాకుండా పాత కాలం స్క్రీన్ ప్లే తోనే చెప్తే అది రొటీన్ సినిమాలా అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. పాత టెంప్లేట్ లో కొత్త స్టోరీ లైన్ ని సెట్ చేసారు. దాంతో ఆ కొత్త పాయింట్ కాస్తా గతంలో చూసినట్లే అనిపించింది. టెంప్లేట్ మార్చాల్సిన సమయం వచ్చేసిందని అర్దం చేసుకోవాలి.

ఇక గత కొంతకాలంగా సొసైటి ఎదుర్కొంటున్న ఫేస్ సర్టిఫికేట్స్  సమస్య చుట్టూ ఈ కథ అల్లారు.  .  ఫేక్‌ సర్టిఫికెట్స్‌ వల్ల నకిలీ సర్టిఫికేట్స్ తో   డాక్టర్లు, ఇంజినీర్లు అయిన వాళ్లు సమాజానికి ఎలా ముప్పుగా మారుతున్నారన్నది ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ గానే చూపించారు. అయితే ఈ సమస్యను మన సమాజం చాలా లైట్ తీసుకుంది. దాంతో నిజానికి అతి పెద్ద ప్లాబ్లమ్ తెరపై తేలిపోయింది. తమిళ కనితన్  రీమేక్‌ గా వచ్చిన ఈ సినిమా తెలుగు నేటివిని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇది మన కథ కాదనిపిస్తుంది. అయితే సినిమాలో వచ్చే ట్విస్ట్ లు, ఫైట్స్, ఛేజింగ్ లు ఇంట్రస్టింగ్ గా ఉండటం కలిసొచ్చింది.

నటీనటులు,టెక్నీషియన్స్

నిఖిల్‌  ఎప్పటిలాగే  తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.  సినిమా ని పూర్తిగా భుజాలపై మోసి నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే స్క్రిప్టు అంతగా సహకరించలేదు. ఇక హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కు సినిమాలో  పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.  హీరో ఫ్రెండ్ గా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి ఫన్ బాగానే పంచాడు. విలన్‌ పాత్రలో తరుణ్‌ అరోరా ఫరవాలేదు, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటీనటులు జస్ట్ ఓకే.

ఇక సాంకేతికంగా చూస్తే…డైలాగులు బావున్నాయి. పాటలు గొప్పగా లేవు. రీరికార్డింగ్ బాగుంది. చాలా  సీన్లలో ఇంటెన్సిటీ లేపటానికి ఉపకరించింది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు.ప్రొడక్షన్ వాల్యూస్  సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.


చూడచ్చా

తమిళ కనితన్ చూడనివాళ్లు ఓ లుక్కేయచ్చు.

ఎవరెవరు..

న‌టీన‌టులు: నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్, త‌దిత‌రులు.
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: టి.సంతోష్‌
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
ఛాయాగ్రహ‌ణం: సూర్య
స‌మ‌ర్పణ‌: ఠాగూర్ మ‌ధు.
సంస్థ‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
విడుద‌ల‌ తేదీ: 29 న‌వంబ‌రు 2019