ఆనంద భైరవి చిత్రం షూటింగ్

Published On: February 17, 2020   |   Posted By:
ఆనంద భైరవి చిత్రం షూటింగ్
 
 
అంజలి, లక్ష్మి రాయ్ ల మధ్య గొడవ
 
షాపింగ్ మాల్, జర్నీ వంటి చిన్న సినిమాలతో తన కెరియర్ స్టార్ట్ చేసి గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో పెద్ద హీరోయిన్ స్థాయికి చేరుకున్న తెలుగు ముద్దుగుమ్మ అంజలి.
 
మన పక్కింటి అమ్మాయిలా ఇంకా చెప్పాలంటే మనింట్లో అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి హిందీ ముద్దుగుమ్మ లక్ష్మి రాయ్ తో గొడవ పడింది. హిందీ లో లక్ష్మి రాయి జూలీ 2 తో కుర్రకారుని ఉర్రూతలూగించి, తమిళ్ లో ఎన్నో చిత్రాలలో నటించి, తెలుగు లో పలు చిత్రాలతో పాటు మెగా స్టార్ చిరంజీవి గారితో ఐటమ్ సాంగ్ చేసి యువతరం గుండెల్లో చెరగని ముద్ర వేసి   ప్రస్తుతం పాయిజన్ 2  లో శృంగార దృశ్యాలలో నటిస్తూ దేశవ్యాప్తంగా కుర్రకారుని పిచ్చెక్కించబోతుంది.
 
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బైట ఎక్కడా గొడవ పడక పోయినా హైదరాబాద్ నానక్ రామ్ గూడా లో ‘ఆనంద భైరవి’ చిత్రం కోసం గొడవ పడే సన్నివేశం లో పోటీపడి నటించారు. 
 
శ్రీ  MVV సత్యనారాయణ MP సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైనమెంట్స్  సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు బీరం తిరుపతి రెడ్డి-రమేష్ రెడ్డి ఇటికేల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కర్రి బాలాజీ, సంగీతం : మణిశర్మ, కెమెరా : పి జి విందా, ఎడిటర్ : చోట కె ప్రసాద్.