ఇద్దరి లోకం ఒక‌టే ట్రైల‌ర్ విడుద‌ల‌

Published On: December 18, 2019   |   Posted By:
ఇద్దరి లోకం ఒక‌టే` ట్రైల‌ర్ విడుద‌ల‌
 
యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…
 
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “నేను ట్రావెల్ చేస్తున్న స‌మ‌యంలో ఈ సినిమాలోని పాట‌ల‌నే వింటున్నాను. చాలా బాగా న‌చ్చాయి. బ్యూటీఫుల్ మెలోడీస్‌. మిక్కి జె.మేయ‌ర్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ పాట‌ల‌ను, నేప‌థ్య సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అబ్బూరి ర‌విగారు చాలా సినిమాలకు బొమ్మ‌రిల్లు నుండి ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా అద్భుత‌మైన డైలాగ్స్ ఇచ్చారు. టెక్నిక‌ల్‌గా చాలా స్ట్రాంగ్‌, మంచి క‌థ‌తో రూపొందిన చిత్రం. థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుడికి సినిమాలోని కొన్ని మాట‌లు, స‌న్నివేశాలు గుర్తుంటాయి. స‌మీర్ రెడ్డి.. ఎక్స్‌ట్రార్డిన‌రీ విజువ‌ల్స్ ఇచ్చాడు. ఇప్ప‌టికే త‌ను చాలా సినిమాల‌కు మా బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేశాడు. ఇక ఎడిట‌ర్ త‌మ్మిరాజు సినిమాను రెండు గంట‌ల పాటు ఉండేలా షార్ప్‌గా ఎడిట్ చేసి ఇచ్చాడు. డైరెక్ట‌ర్ జీఆర్‌.కృష్ణ  సి.వి.రెడ్డిగారి ద‌గ్గ‌ర నుండి ప‌నిచేస్తూ వ‌చ్చాడు. త‌ను రెండున్న‌రేళ్ల ముందు ఈ ఐడియా చెప్ప‌గానే, విప‌రీతంగా న‌చ్చింది. త‌ను చాలా ఓపిక‌గా మంచి సినిమాను రెడీ చేసి ఇచ్చాడు. బెక్కం వేణుగోపాల్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ రత్నం అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఇక రాజ్‌త‌రుణ్ గురించి చెప్పాలంటే ల‌వ‌ర్ సినిమాను బాగా ఇష్ట‌ప‌డి చేశాం. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ స‌మ‌యంలో కృష్ణ‌, బెక్కం వేణుగోపాల్ వెళ్లి ఈ సినిమా గురించి చెప్ప‌గానే రాజ్ నాకు ఫోన్ చేశాడు. త‌ను నాకు ఫోన్ చేసి నేను చేస్తాన‌ని అనడంతో నేను ఓకే అన్నాను. నేను ఎప్పుడూ స‌క్సెస్, ఫెయిల్యూర్‌ను బేరీజు వేసుకుని సినిమాలు చేయ‌లేదు. అలాగే రాజ్‌తో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో రాజ్ చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. త‌ను కొత్త‌గా క‌నిపిస్తాడు. షాలిని పాండే, అద్భుతంగా చేసింది. సినిమా అంతా ఎక్కువ‌గా రాజ్‌త‌రుణ్‌, షాలిని మ‌ధ్యే జ‌రుగుతుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు గుండె బ‌రువుతో బ‌య‌ట‌కు వ‌స్తారు.ఎఫ్ 2, మ‌హ‌ర్షితో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాం. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొడ‌తాం“ అన్నారు. 
 
 
రైట‌ర్ అబ్బూరి ర‌వి మాట్లాడుతూ – “ఈ సినిమా గురించి చెప్పాలంటే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ అనాలి. మంచి స‌బ్జెక్ట్‌. డైరెక్ట‌ర్ కృష్ణ ఈ సినిమా కోసం చాలా వెర్ష‌న్స్ రాసుకుని చేశాడు. చివ‌రి 30 నిమిషాలు సినిమాను ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేరు. సినిమా చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. హృద‌యాల‌తో చూసే ప్యూర్ ల‌వ్‌స్టోరీ ఇది“ అన్నారు. 
 
 
డైరెక్ట‌ర్ జి.ఆర్‌.కృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమా అవ‌కాశాన్ని మాకు ఇచ్చిన దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. హీరోయిన్ విష‌యంలో మేం ఎవ‌రిని తీసుకోవాలా? ఆలోచిస్తున్న‌ప్పుడు శిరీష్‌గారు షాలిని పాండేగారి పేరు చెప్పారు. చాలా డిస్క‌ష‌న్ చేసిన త‌ర్వాత షాలిని పాండే క్యారెక్ట‌ర్‌కి యాప్ట్ అవుతుందో లేదో అని చిన్న సందేహం ఉండేది. కానీ రేపు సినిమా చూస్తే త‌ను ఎంత గొప్ప‌గా న‌టించిందో తెలుస్తుంది. పాటల‌కు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మిక్కి గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. స‌మీర్‌రెడ్డిగారు బ్యూటీఫుల్‌గా పెయింటింగ్‌లాంటి విజువ‌ల్స్ ఇచ్చారు. మా బ‌డ్జెట్ ప‌రిధిలో అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను 47 రోజుల్లోనే పూర్తి చేశాం. మంచి సినిమా తీశాం. బెక్కంగారు నా బ్ర‌ద‌ర్‌లా స‌పోర్ట్ చేశారు. రాజ్‌త‌రుణ్ హీరోగా ఈ క‌థ‌కు ఎలా సెట్ అవుతాడ‌ని కొంద‌రు అన్నారు. కానీ నేను త‌న‌పై న‌మ్మ‌కంతో ముందుకెళ్లాను. రాజ్‌కూడా నాపై న‌మ్మ‌కంతో ముందుకు వ‌చ్చాడు. షాలిని పెర్ఫామెన్స్ ప‌రంగా అద‌ర‌గొట్టింది. రాజ్‌, షాలిని మ‌న మ‌న‌సుల్లో ఉండిపోతారు. త‌మ్మిరాజుగారు క‌థ‌కు అవ‌స‌రం లేకపోతే ఎడిట్ చేసేశారు. సినిమా లెంగ్త్ 2 గంట‌ల‌6 నిమిషాలు ఉంది. ఈ జ‌ర్నీలో నాకు హెల్ప్ చేసిన అంద‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు. 
 
 
హీరో రాజ్‌త‌రుణ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో నాకు న‌టించే అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి, ఈ క్యారెక్ట‌ర్‌లో న‌న్ను ఊహించుకున్న డైరెక్ట‌ర్ కృష్ణ‌గారికి, బెక్కం వేణుగోపాల్‌గారికి థ్యాంక్స్‌. షాలిని పాండే ఎక్స‌లెంట్ పెర్ఫామెర్‌. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన  సినిమాల‌కు భిన్నంగా ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. ర‌విగారు, అద్భుత‌మైన మాట‌లను అందించారు. మిక్కి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. ఆయ‌న‌తో ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. స‌మీర్‌గారికి, త‌మ్మిరాజు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. ఇదొక హార్ట్ ట‌చింగ్ ఫీల్ గుడ్ మూవీ. ప్రేక్ష‌కుడు సినిమా చూసేట‌ప్పుడు ల‌వ్‌ను ఫీల్ అవుతాడు. ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా సినిమా హాంట్ చేస్తుంది. డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది“ అన్నారు. 
 
 
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “సినిమా కోసం డైరెక్ట‌ర్ కృష్ణ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. చాలా వెర్ష‌న్స్‌ను రాసుకున్నాడు. చాలా ఓపిగ్గా సినిమా చేశాడు. డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా అభినంద‌న‌, నీరాజ‌నం స్టైల్లో ఉండే ప్యూర్ ల‌వ్‌స్టోరీ“ అన్నారు.