ఈ నెల 26న దిలీప్‌కుమార్ స‌ల్వాది “దిక్సూచి” విడుదల

Published On: April 22, 2019   |   Posted By:

ఈ నెల 26న దిలీప్‌కుమార్ స‌ల్వాది “దిక్సూచి” విడుదల

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఈ నెల 26న  విడుదలవుతుంది.  

ఈ సంద‌ర్భంగా  దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ… నిర్మాత నర్సింహ రాజు  గారు న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయకుండా  ఓ కొత్త జొనర్ లొ   సినిమాను చేశాము.  ఫ్యామిలీ అంతా  వెళ్ళి చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ .సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌.  థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో తీసిన ఈ చిత్రం 2019 లొ ది బెస్ట్ మూవీ గా  ఉంటుందని మా టీమ్   కాన్పిడెంట్ గా ఉంది.  ఏప్రిల్  26న గ్రాండ్ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చెస్తున్నాము. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు.

దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ:సాయి సతీష్, ప్రొడ్యూస‌ర్స్ఃన‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాఃజ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మనాభ్  భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌,కట్స్: డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది ,