ఎల్‌కేజీ 2020 మూవీ రివ్యూ

Published On: June 26, 2021   |   Posted By:

ఎల్‌కేజీ 2020 మూవీ రివ్యూ

ఫన్ లో ‘పీజీ’: ఎల్‌కేజీ 2020 రివ్యూ
 Rating: 2.5/5

అప్ప్టట్లో తమిళ సినిమాలను స్పూఫ్ చేస్తూ  తమిళ పదం అనే సినిమా వచ్చి హిట్టైంది. దాన్ని సుడిగాడు గా రీమేక్ చేసుకున్నాం. ఆ తర్వాత తమిళ రాజకీయాలపై సెటైర్ గా ఈ ఎల్ కేజీ వచ్చి హిట్టైంది. ఈ సినిమాని ఎందుకనో మనవాళ్లు రీమేక్ చేయలేదు. డబ్బింగ్ అయ్యి ఓటిటిలో రిలీజైంది. సాధారణ కౌన్సిలర్ ఎమ్మల్యే అయ్యే క్రమంలో జరిగే పరిణాలను వ్యంగ్యాత్మకంగా చూపిన ఈ కథ తెలుగువారిని పలకరించింది. ఆ కథేంటి…మనవాళ్లకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయా ఈ డబ్బింగ్ సినిమాలో వంటి విషయాలు రివ్యూ చేద్దాం.

స్టోరీ లైన్

తన తండ్రి  ఓ పొలిటకల్ పార్టీలో ఉపన్యాసుకుడుగా మిగిలిపోతాడు. దాంతో లంకవరపు కుమార్‌ గాంధీ అలియాస్‌ ఎల్‌కేజీ(ఆర్జే బాలాజీ) తాను రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలని నిర్ణయించుకుంటాడు. దాంతో తన ఊళ్లో వార్డు కౌన్సిలర్ గా పొలిటికల్ కెరీర్ మొదలెడతాడు. ప్రతీది ఓటుగానే భావించే…‌. ఆ వార్డులో వాళ్లకు తలలో నాలుకలా మారిపోతాడు. వాళ్ల పనులు క్షణాల్లో చేయించి మెప్పు పొందుతాడు. ఈ లోగా  రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యం బారిన పడి మరణిస్తాడు. దీంతో ఎల్‌కేజీ ఖాళీ అయిన ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యే అవ్వాలనుకోవటంతో అసలు కథ మొదలవుతుంది. ఓ వార్డ్ కౌన్సిలర్ స్దాయి వ్యక్తి ఎమ్మల్యే ఎలక్షన్స్ లో పాల్గొని గెలవగలడా…ఏ విధంగా సీనియర్స్ అయిన ప్రత్యర్దులను ఎదుర్కొంటాడు. అందుకోసం వేసే ఎత్తులేమిటి..చివరకు ఎల్‌కేజీ ఎమ్మెల్యే అయ్యాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎనాలసిస్ …

పొలిటికల్ సెటైర్ సినిమాలు ఇప్పటికే మనం చాలా చూసి ఉంటాం. అయితే వాటికి, ఈ సినిమాకు తేడా ఏమిటంటే…ఐడియాలజీ. ఏదో కామెడీ కోసం సీన్స్ రాయకుండా…రాజకీయ వ్యవస్దలో ఉన్న అనేక అంశాలను వ్యంగ్యాత్మకంగా మన ముందు ఉంచారు. అలాగే గత కొంతకాలంగా పాపులర్ అయిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్లాన్స్ చేసే కార్పొరేట్‌ సంస్థలు విధి విధానాలను ఇందులో చర్చించారు. అవి ఏవిధంగా పనిచేస్తాయి? ఎలాంటి ప్రచార ప్లాన్స్  అమలు చేసి తన దగ్గరకు వచ్చిన అభ్యర్దులను గెలిపిస్తాయి? అన్న వాటిని చాలా చక్కగా చూపించారు.స ఆ సీన్స్ అన్నీ బాగా పండాయి.  వాటితో పాటు ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా నిలుస్తూ, ప్రధాన పాత్ర పోషిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్,  బిగ్ బాస్, సోషల్‌ మీడియా, మీమ్స్‌,టీవి చర్చా వేదికలు వంటివన్ని సెటైర్ చేస్తూ ప్రస్తావించారు. ఇది పూర్తిగా ఆర్జే బాలాజీ షో. తనే రాసి, నటించిన ఈ సినిమా ఇప్పటి రాజకీయ పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించి ప్రతి సన్నివేశాన్ని వ్యంగ్యంగా ప్రేక్షకుడిని అలరించేలా రాసుకున్నారని అర్దమవుతుంది. అదే సినిమాకు ప్లస్ అయ్యింది. అలాంటి సీన్స్ అన్నిటిని కలిపి ఓ స్క్రిప్టు గా రాసుకోవటం, స్క్రీన్ ప్లే చేయటం చాలా కష్టం. కానీ ఆర్జే బాలాజీ కొంచెం కష్టమైనా ఇష్టంగా లాగేసారు. అయితే జోక్స్ పేలిన చోట బాగున్నా మిగతా చోట్ల కథ కదలక ఇబ్బందిగా అనిపిస్తుంది.  

 టెక్నికల్ గా …

ఇలాంటి సినిమాకు అవసరమైన  డైలాగులు సినిమాలో బాగానే పడ్డాయి. ఓటు విలువను తెలియజేస్తూ క్లైమాక్స్‌లో వచ్చే డైలాగులు సినిమాకు నిండుతనం తెచ్చాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. డబ్బింగ్ ని ఇక్కడ తెలుగుని దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పులు..‘అల వైకుంఠపురములో’ అలరించిన ‘సిత్తరాల సిరపడు’ పాట వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కెమెరా వర్క్ ఫన్ సినిమాకు సరపడ స్దాయిలో ఉంది. ఎడిటింగ్ ఎక్కడా లాగ్ లు లేకుండా లాగేసింది. దర్శకుడు పెద్దగా కష్టపడినట్లు కనపడదు. తన మార్క్ చూపించలేదు. కేవలం స్క్రిప్టుని ఫాలో అయ్యిపోయాడు. నటీనటుల్లో ఆర్జే బాలాజీ ఒంటి చేత్తో సినిమాని మోసాడు. ప్రియా ఆనంద్ ఓ కార్పోరేట్ మహిళగా బాగా చేసింది.సంగీతం జస్ట్ ఓకే.

చూడచ్చా…

నవ్వుకోవాలనుకునేవాళ్లకు మంచి ఆప్షన్.

ఎవరెవరు..

 నటీనటులు: ఆర్జే బాలాజీ, ప్రియా ఆనంద్‌, సంపత్‌, జె.కె.రితేశ్‌, రామ్‌ కుమార్‌ గణేశన్‌, అనంత్‌ వైద్యనాథన్‌ తదితరులు;
 సంగీతం: లియోన్‌ జేమ్స్‌;
సినిమాటోగ్రఫ్రీ: విధు అయ్యన్న;
ఎడిటింగ్‌: ఆంథోని;
నిర్మాత: ఇషారి కె.గణేశ్‌;
రచన: ఆర్జేబాలాజీ అండ్‌ ఫ్రెండ్స్‌;
దర్శకత్వం: కె.ఆర్‌.ప్రభు;
 ఓటీటి: ఆహా
విడుదల తేదీ:  25  జూన్,2021
రన్ టైమ్: 124 నిముషాలు