ఎస్.ఆర్.కళ్యాణ మండపం చిత్రం ఆగస్టు 28 న ఆహాలో విడుదల

Published On: August 24, 2021   |   Posted By:

ఎస్.ఆర్.కళ్యాణ మండపం చిత్రం ఆగస్టు 28 న ఆహాలో విడుదల

ఆగస్టు 28 న ‘ఆహా’లో సందడి చేయనున్న‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ 
 
 
తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’.బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోస్‌తో నిరంత‌రం ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’.
 
 
తాజాగా థియేటర్లలో విడుదలై సూప‌ర్ హిట్ అయిన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రం ఆగస్టు 28 న ‘ఆహా’ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది.
 
ఈ సందర్భంగా…
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మా నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ నిజం చేసి ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ ను అపూర్వంగా ఆదరించారు. థియేటర్స్‌లో మా సినిమాను ఆద‌రించిన విధంగానే ఈ ఆగ‌స్ట్ 28న ఆహాలో విడుద‌ల‌వుతున్న మా సినిమా ఆద‌రించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఆహా లిస్టులో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు. 
 
‘ఆహా’ రీసెంట్‌గా ‘తరగతి గది దాటి’ అనే క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరిని అందించిన ఆహా..  అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన‌  అద్భుత‌మైన సైఫై థ్రిల్ల‌ర్ ‘కుడిఎడ‌మైతే’ వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, చతుర్‌ముఖం వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్, వెబ్ షోస్‌ను 2021లో ప్రేక్ష‌కుల‌కు అందించింది ‘ఆహా’.