“ఓన్లీ నేను బ‌ట్ నాట్ ఎలోన్” చిత్రం ట్రైల‌ర్ లాంచ్‌

Published On: March 21, 2019   |   Posted By:

ఓన్లీ నేను … బ‌ట్ నాట్ ఎలోన్ చిత్రం  ట్రైల‌ర్ లాంచ్‌


స‌ర్క‌డ‌మ్‌స్టోరీస్ బ్యాన‌ర్ పై స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఓన్లీ నేను. పూర్విట‌క్క‌ర్‌, చింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శేష‌గిరిరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర  ట్రైల‌ర్‌ను ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో మీడియా స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

ద‌ర్శ‌కుడు స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ… ప్రేమ‌, ఫ్యామిలీ, కామెడీ ఇవ‌న్నీ కామ‌న్ గా వ‌చ్చే స్టోరీలు. బేసిక్‌గా నేను ఒక వ్యాప‌ర‌వేత్త‌ని. కొంత‌మంది పెద్ద‌వాళ్ళ స‌ల‌హా మేర నేను స‌ర్క‌డ‌మ్ స్టోరీస్ అనే బ్యాన‌ర్‌ పెట్ట‌డం జ‌రిగింది.   ఈ చిత్ర క‌థాంశం ప్ర‌పంచం మొత్తంలో టాప్‌టెన్ బిలినియ‌ర్స్‌లో మ‌హిళలు లేక‌పోవ‌డం అనే అంశం పై క‌థ. ఒక అంద‌మైన తెలివైన అమ్మాయికి క‌లిగిన బాధ‌ ఎక్క‌డుంది ఉమెన్ ఎన్‌ప‌వ‌ర్‌మెంట్ అంటూ… నేనెందుకు ఆ స్థానంలో ఉండ‌కూడ‌దు అన్న‌దే ఆ అమ్మాయి గోల్‌. అందులో భాగంగానే త‌న సొంత స్నేహితురాలిని సైతం చంప‌డానికి వెన‌కాడ‌దు. ఈ సర్క‌డ‌మ్ స్టోరీస్ బ్యాన‌ర్ త‌ర‌పున అఫీషియ‌ల్‌గా ఈ రోజును విడుద‌ల చేశాము. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత శేష‌గిరిరావు మాట్లాడుతూ… నాకు ఈ చిత్రం ద్వారా ఆయ‌న‌తో భాగ‌స్వామ్యం కావ‌డం చాలా సంతోషంగా ఉంది. డిసెంబ‌ర్‌6కి ఈ చిత్రం పూర్త‌వుతుంది. ఈ చిత్రంలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. క‌థ చాలా కొత్త‌గా ఉంటుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాలి అన్నారు.

హీరో చింగ్ మాట్లాడుతూ… నేను ఒక లాయ‌ర్‌ని న‌న్ను న‌మ్మి నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. 

హీరోయిన్ పూర్వి ట‌క్క‌ర్ మాట్లాడుతూ… నేను శ్రీ‌నివాస్‌గారితో క‌లిసి గ‌తంలో చాలా ప్రాజెక్ట్‌లో ప‌ని చేశాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా విడుద‌ల కోసం నేను కూడా చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నా అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాల‌చంద‌ర్ మాట్లాడుతూ… మీరు ట్రైల‌ర్‌లో చూసిన పాట నేనే చేశాను. నాకు తెలిసి మీ అంద‌రికీ బాగా న‌చ్చి ఉండ‌చ్చు. గ‌తంలో నేను జెనీలియా క‌థ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. త‌ర్వాత నాకు త‌మిళ్‌లో ఆఫ‌ర్స్ వ‌స్తే వెళ్ళాను. ఇప్పుడు మ‌ళ్ళీ తిరిగి తెలుగు ఇండ‌స్ర్టీకి ఈ సినిమాతో క‌మ్‌బ్యాక్ అనుకుంటున్నాను. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి ఆద‌రించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నావాస్‌, శేష‌గిరిరావు, చింగ్‌, పూర్విట‌క్క‌ర్‌, మైరా అమిటి, బాలచంద‌ర్‌, సంధ్యారెడ్డి, చ‌త‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు.