కలర్ ఫోటో చిత్రం ప్రారంభం

Published On: January 8, 2020   |   Posted By:
కలర్ ఫోటో చిత్రం ప్రారంభం
 
హృదయ కాలేయం , కొబ్బరి మట్ట తరువాత అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!
 
హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి  చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ ను సునీల్ అందించిన ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని, నిర్మాత రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.
 
యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 1995 లో ఒక ఇంజనీరింగ్ కాలేజి లో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. 
 
చిత్రం: కలర్ ఫోటో
బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్