కలియుగ డిసెంబరు విడుదల

Published On: November 8, 2019   |   Posted By:
కలియుగ డిసెంబరు విడుదల
 
డిసెంబరులో లో మొదటి వారం లొ  కలియుగ” 
 
శ్రీ బాలాజీ సిల్వర్ స్క్రీన్  పతాకంపై స్వాతి దీక్షిత్’ సై సూర్య, శశి. విశ్వ.రాజా. ప్రభాస్ శ్రీను. తాగుబోతు రమేశ్  ప్రదాన పాత్రల లో తెరకెక్కిన  చిత్రం ” కలియుగ ”  ఈ చిత్రానికి  తిరుపతి దర్శకత్వం వహించాడు. 
 
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు పూర్తి చేసుకుని   U/A”  సెన్సార్ సర్టిఫికెట్ అందుకుని  విడుదల కు సిద్దమైనది.
 
ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునె  కధనం తో రూపొందుతున్న  ” కలియుగ ” చిత్రాన్ని   ప్రస్తుతం సమాజంలో ఉన్న  వాస్తవాలకి దగ్గరగా ఉండేలా  … అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేవిధంగా తెరకెక్కించాం..ఈ చిత్రంలో  సూర్య నటన హైలెట్ గా ఉంటుంది. టెక్నికల్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. ముందుగా ఈ చిత్ర  ప్రమోషన్ సాంగ్ ను గురువారం ప్రముఖ సీనియర్ నటి  జీవిత రాజశేఖర్ విడుదల చేసారు.
 
అనంతరం   మాట్లాడుతూ…    కలియుగ చిత్ర ప్రమోషన్ సాంగ్ రిలీజ్ చేయటానికి కారణం సూర్య.. మాకు సూర్య ఎప్పటినుండో తెలుసు రాజశేఖర్ గారికి తమ్ముడి గా నటించాడు .సినిమా తీసి రిలీజ్ చేయటం మాలాంటి వాళ్ళకి చాలా కస్టం. అయినా సరే సూర్య సినిమా తీసి డిసెంబరు మొదటి వారంలొ రిలీజ్ చేస్తున్నాడు. ట్రైలర్స్ లొ వల్గారిటి ఎక్కువ చూపించి ప్రేక్షకుల ను ధియేటర్లకు రప్పించి క్యాస్   చేసుకునే ఈ సమయంలో … ఆడవారి పై జరుగుతున్న అన్యాయాల పై ప్రతీకారం తీర్చుకునె కథ తో ముందుకు రావటం చాలా గొప్ప విషయం.  ఆడవారి భద్రత కొసం కేంద్ర పరిధి లో రాష్ట్ర పరిధి లో ఎన్ని చట్టాలని తెచినా జరిగే అన్యాయాలు జరుగుతూనె ఉన్నాయి. సూర్య సినిమా రూపంలో ఆడవాళ్ల సమస్య ని మనముందుకు తీసుకొస్తునందుకు  సుర్యని అభినంధి స్తున్నాను . ఈ సినిమా ను అందరూ ఆదరించి మంచి విజయం సాధించాలని .. సూర్య కి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అన్నారు   డిసెంబరు మొదటి వారంలో “కలియుగ ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామని  దర్శక. నిర్మాతలు తెలిపారు. ధన్ రాజ్. కారుమంచు రఘు. గౌతం రాజు. ప్రవీణ్.  సమీర్.సిగ్ధ. తదితరులు నటించిన ఈ చిత్రానికి 
 
కెమెరా: సత్య V  ప్రభాకర్.  
సంగీతం: కమల్.D
ఎడిటింగ్: నందమూరి హరి
పైట్స్ : నందు 
సహ నిర్మాత: దుర్గా మల్లేశ్వరరావు 
నిర్మాత: Ch. సుబ్రమణ్యం