కళాపోషకులు చిత్రం టీజ‌ర్ విడుద‌ల

Published On: October 21, 2020   |   Posted By:
కళాపోషకులు చిత్రం టీజ‌ర్ విడుద‌ల‌
 
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.  న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఈ మూవీ టీజ‌ర్ ను మీడియా త‌రుపున సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్రభు విడుద‌ల‌చేసి చిత్ర విజ‌యాన్నిఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో.. 
 
ద‌ర్శ‌కుడు చలపతి పువ్వల మాట్లాడుతూ –  ‘‘ముందుగా న‌న్ను నమ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించ‌డం వ‌ల్లే ఔట్‌పుట్ ఇంత‌బాగా వ‌చ్చింది. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొద‌టి సినిమా అయినా చాలా బాగా న‌టించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.’ అని అన్నారు.
 
నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ –  ‘‘మీడియా వారి చేతుల మీదుగా మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల‌చేయ‌డం హ్యాపీగా ఉంది.  ఈ క‌థకి హీరోగా విశ్వకార్తికేయ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా  అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి`’ అన్నారు.
 
హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ –  “ఈ మూవీ ఒక  టీమ్ వ‌ర్క్‌, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్  సపోర్ట్‌తోనే మంచి ఔట్‌పుట్ సాధ్యం అయింది. నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి గారు ముందుండి మాకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకున్నారు. చ‌ల‌ప‌తి గారు ఈ క‌థ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే బాగా న‌చ్చి ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. మేమంద‌రం ఎంతో ఇష్టంగా క‌ష్ట‌ప‌డి చేసిన `క‌ళాపోష‌కులు` చిత్రానికి  మీ అంద‌రి ఆశిర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు జెమిని సురేష్, జ్వాలా చ‌క్ర‌వ‌ర్తి, చైతన్య, లిరిసిస్ట్ రాంబాబు గోసాల‌, సంతోష్‌, మ‌హేష్‌, రాణి త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు.
 
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను 
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల.