కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 త్వ‌ర‌లో ప్రారంభం

Published On: November 23, 2020   |   Posted By:
కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 త్వ‌ర‌లో ప్రారంభం
 
కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేదిక్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా త్వ‌ర‌లో  ప్రొడ‌క్ష‌న్ నెం-1 ప్రారంభం!!
 
కొత్త వారిని, కొత్త తీరుని ప్రొత్స‌హించ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగా కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేది‌క్ ఎంట‌ర్ టైన్ మెంట్స్  ప‌తాల‌కాల‌పై   ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా  ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ  సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.   
 
ఈ చిత్రం ద్వారా నూత‌న తార‌ల‌తో పాటు unreal engine అనే ఓ కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నారు. 
 
ద‌ర్శ‌కుడుగా  కిగోర్ , హీరోగా  కార్తిక్  రచాపుడి ని ఇంట‌ర్ డ్యూస్ అవుతున్నారు.
 
త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు  అతి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.
 
సంగీతంః  అచ్చు రాజ‌మ‌ణి.  నిర్మాత‌లుః ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ.  డైర‌క్ట‌ర్ః కిగోర్‌.