గుండె క‌థ వింటారా సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌

Published On: September 1, 2021   |   Posted By:

గుండె క‌థ వింటారా సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌


పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…`ఫుల్ వీడియో సాంగ్ విడుద‌లై శ్రోత‌ల‌నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంటుంది.

`ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా…గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి సాంగ్‌కి మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
 
గుండె క‌థ వింటారా సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కి సిద్ద‌మైంది.

తారాగ‌ణం:
మ‌ధునంద‌న్, స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వంశీధ‌ర్
నిర్మాత‌లు : క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప
బ్యాన‌ర్‌: ట్రినిటి పిక్చర్స్
సినిమాటోగ్ర‌ఫి: ర‌వి వ‌ర్మ‌న్ నీలిమేఘం, సురేష్ భార్గ‌వ్‌
సంగీతం: మ‌సాల కాఫీ
ఎడిట‌ర్‌: సాయి కిర‌ణ్ ముద్దం
యాక్ష‌న్‌: `రియ‌ల్` స‌తీష్
కొరియోగ్ర‌ఫి: భాను మాస్ట‌ర్
లిరిక్స్‌: కృష్ణ చైత‌న్య