చతుర్ముఖం చిత్రం ఆహా ఓటీటీ విడుద‌ల‌

Published On: August 6, 2021   |   Posted By:
 
Image
 
 
చతుర్ముఖం చిత్రం ఆహా ఓటీటీ విడుద‌ల‌
 
మంజు వారియ‌ర్‌, స‌న్నీవేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్ `చతుర్ముఖం`.. `ఆహా` ప్రీమియర్‌గా ఆగ‌స్ట్ 13న 
 
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఫ్లాట్‌ఫామ్ ఆహాలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, వైవిధ్య‌మైన వెబ్ ఒరిజిన‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.
 
ఈ క్ర‌మంలో టెక్నో హార‌ర్ థ్రిల్ల‌ర్ ఆగ‌స్ట్ 13న విడుద‌ల‌వుతుంది. మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె, శ్రీకాంత్ ముర‌ళి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని రంజిత్ కామ‌ల శంక‌ర్‌ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి మ‌ల‌యాళ మాతృక‌. బుసాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్(బీఐఎఫ్ఏఎన్‌), చుంచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌(సీఐఎఫ్ఎఫ్‌), మేలిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌(ఎంఐఎఫ్ఎఫ్‌) ఇలా ప‌లు అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైంది. ఈ సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను `ఆహా` గురువారం విడుదల చేసింది. 
 
చతుర్ముఖం ప్ర‌స్తుత కాలానికి చెందిన తేజ‌స్విని అనే మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన మ‌హిళ జీవితం చుట్టూ తిరిగే క‌థ‌. ఈమె స్నేహితుడు ఆంటోనితో క‌లిసి సీసీటీవీ సోల్యుష‌న్స్ వ్యాపారాన్ని చేస్తుంటుంది. ఆమె త‌న మొబైల్ ఫోన్‌కు విప‌రీతంగా అల‌వాటు ప‌డుంటుంది. ఓ ప్ర‌మాదంలో ఆ ఫోన్ ప‌ని చేయ‌కుండా పోతుంది. అప్పుడు త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్స్ ఉన్న బ్రాండెడ్ కానీ ఓ మొబైల్ ఫోన్‌ను తేజ‌స్విని కోనుగోలు చేస్తుంది. ఫోన్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమె చుట్టూ ఆతీంద్రీయ శ‌క్తుల ప్ర‌భావంతో కొన్ని పనులు జ‌రుగుతుంటాయి. అవి ఆమె ఉనికికే ప్ర‌మాదంగా మారుతాయి. ఇలాంటి ప్ర‌మాదం నుంచి ఆమె ఎలా బ‌య‌ప‌డింది. ఎలాంటి ప‌రిష్కారం క‌నుగొంద‌నేదే క‌థ‌. భార‌తీయ సినిమాల్లో అరుదైన జోన‌ర్‌లో వ‌చ్చిన చిత్ర‌మే చ‌తుర్ముఖం. సినిమా చూసే ప్రేక్ష‌కులు ప్ర‌తి నిమిషం థ్రిల్ అవుతుంటారు. 
 
ప్ర‌తి వారం `ఆహా`త‌మ వీక్ష‌కుల కోసం తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందించింది. మ‌మ్ముట్టి నటించిన `వ‌న్‌`, న‌య‌న‌తార `నీడ‌`, రిష‌బ్ శెట్టి `హీరో`టోవినో థామ‌స్ యాక్ష‌న్ మూవీ `కాలా`, విజ‌య్ సేతుప‌తి `విక్ర‌మార్కుడు` చిత్రాలు స‌హా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు `ఆహా` అందించింది. రీసెంట్‌గా అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా విడుద‌లైన సై ఫై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ `కుడి ఎడ‌మైతే`కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. లక్ష్మీ మంచు హోస్ట్‌గా సెల‌బ్రిటీలు చేస్తున్న వంట‌ల షో `ఆహా భోజ‌నంబు`ల‌తో పాటు ఈ ఏడాది `క్రాక్‌, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబి రెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` వంటి చిత్రాలు, ఒరిజ‌న‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది `ఆహా`.