జగపతి బాబు నిత్యావసర సరుకుల పంపిణీ

Published On: May 26, 2020   |   Posted By:

  జగపతి బాబు నిత్యావసర సరుకుల పంపిణీ 

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు ,లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర  సరుకులు , మాస్క్ లు పంపిణీ చేశారు . 400 మంది సినిమా కార్మికులకు బియ్యం , పప్పులు ,నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు . ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్ , భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు జగపతి బాబు మేనేజర్ మహేష్ , సహాయకుడు రవి పాల్గొన్నారు .